/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Atrocious-in-third-lane-in-Dwarkanagar-Visakha.-Mahesh-brutally-killed-a-woman-named-Sujata-jpg.webp)
విశాఖ ద్వారకానగర్‌లో థర్డ్ లేన్‌లో దారుణం చోటుచేసుకుంది. సుజాత అనే మహిళను దారుణంగా మహేష్ అనే యువకుడు చంపాడు. గొంతు కోసి దారుణంగా హత్య చేసిన మహేష్. అనంతరం తాను కూడాగొంతు కోసుకున్నాడు. మహేష్‌ను కేసీహెచ్‌కు పోలీసులు తరలించారు. భర్తకు దూరంగా సుజాత ఉంటోంది. మహేష్, సుజాత మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుజాతపై మహేష్ తల్లి ఉమ ఆరోపణలు చేసింది. ఉద్యోగాల కోసం సుజాతకు రూ.7 లక్షలు ఇచ్చామని ఉమ తెలిపారు.
స్థానిక వివరాల ప్రకారం... ఈ ఇద్దరి మధ్య 4 ఏళ్లుగా స్నేహం కూడా కొనసాగుతున్నదని కొంతమంది తెలిపారు. ఈరోజు సాయంత్ర సమయంలో సత్య దేవిఎన్‌క్ల్యూవ్ దగ్గర సుజాత పనిచేస్తున్న దగ్గరకు వచ్చి దారుణంగా హత్య చేశాడు. ఘటనపై సమాచారం అందుకున్న ద్వారకా పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సుజాత మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు. సుజాతని హత్య చేసిన తర్వాత కూడా మహేష్ గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని అక్కడున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయాలతో ఉన్న మహేష్‌ని చూసిన పోలీసులు వైద్యం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు. మహేష్ గొంతుకి బలమైన గాయం కావడంతో అతను మాట్లాడే పరిస్థితిలో లేడని పోలీసులు తెలిపారు. సత్య శ్రీదేవి ఎన్‌క్ల్యూవ్‌లో సుజాత 20 రోజుల క్రితమే ఉద్యోగంలో జాయిన్ అయింది. అయితే ఉమా మహేష్ తరచూ సుజాత పనిచేస్తున్న దగ్గరికి వచ్చేవాడని కొంతమంది తెలిపారు. అయితే మహేష్ హత్య చేసి తర్వాత.. తనకు తానుగా హత్య చేసుకున్నట్లుగా పోలీసులకు ప్రాథమిక సమాచారం ఇచ్చారు.
వీరిద్దరికి ఉద్యోగాల నిమిత్తం డబ్బులు
అయితే ..మహేష్‌కి సుజాతకు మధ్య ఉన్న సంబంధమేంటి..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. సుజాత భర్తకు ఎందుకు దూరంగా ఉంటుందని పోలీసులు విచారిస్తున్నారు. వీరిద్దరు ఎంత కాలం నుంచి దూరంగా ఉంటున్నారు..? అలాగే కుటుంబ సమస్యలు ఎందుకు వచ్చాయి..? అనే నేపథ్యంలో ఆరా తీస్తున్నారు. అయితే.. సుజాత కేసులో తల్లి కొత్తకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. వీరిద్దరికి ఉద్యోగాల నిమిత్తం డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బుల కోసం గత కొంతకాలంగా సతీష్ అనే వ్యక్తి అడుగుతుంటే ఇవ్వటం లేదని ఉమామహేష్ తల్లి ఆరోపించారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సుజాత తల్లి కూడా మాట్లాడుతూ.. అనేక ఆరోపణలు ప్రస్తావించారు. అయితే సుజాత భర్త గతంలో కూడా అనేక రకాలుగా కొట్టి హింసించేవాడని పోలీసులకు చెప్తే ఎక్కడ చంపేస్తారని భయంతోటి వాళ్ళు ఫిర్యాదు కూడా చేయలేదని సుజాత తల్లి తెలిపారు. పోలీసులు వ్యక్తిగత కారణాలు ఏమైనా ఉన్నాయా..? ఆర్థిక లావాదేవీల అనే అంశాలు ఉన్నాయా అనే అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి:రాహుల్.. ప్రియాంకపై పోస్టర్ల కలకలం..వేషగాళ్లు అవసరమా అంటూ విమర్శలు
Follow Us