Virat Kohli Smartphone: వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ వాడిన ఫోన్ ఏదో తెలుసా..!

2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఐఫోన్‌తో కనిపించాడు. విరాట్‌ కోహ్లి వాడుతున్న ఐఫోన్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ ఉండడం గమనించవచ్చు. దాని బట్టి చుస్తే విరాట్ ఐఫోన్ 15 ప్రో వేరియంట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది.

New Update
Virat Kohli Smartphone: వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీ వాడిన ఫోన్ ఏదో తెలుసా..!

Virat Kohli Smartphone Details: విరాట్ కోహ్లి స్మార్ట్‌ఫోన్: 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 76 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. అతను ఏ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నాడో తెలుసుకోవాలనుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ చాలా సందర్భాలలో వివిధ స్మార్ట్‌ఫోన్‌లతో కనిపిస్తున్నప్పటికీ, అతని ప్రైమరీ స్మార్ట్‌ఫోన్ ఏంటో తెలుసా?

2024 టీ20 ప్రపంచకప్ సందర్భంగా విరాట్ కోహ్లీ ఐఫోన్‌తో కనిపించాడు. విరాట్‌ కోహ్లి వాడుతున్న ఐఫోన్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. అందులో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ ఉండడం గమనించవచ్చు. దాని బట్టి చుస్తే విరాట్ ఐఫోన్ 15 ప్రో వేరియంట్‌ను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తుంది. విరాట్ కోహ్లీ ప్రాథమిక ఫోన్ ఐఫోన్ 15 ప్రో అని స్పష్టమైంది.

ధర ఎంత?
క్రికెట్ మైదానంలో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఫోన్‌లో వీడియో కాల్స్ చేయడం చాలాసార్లు కనిపించింది. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కూడా అతను తన భార్య అనుష్కతో మాట్లాడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ఐఫోన్‌లు అనేక రకాల శ్రేణుల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే కోహ్లీ స్మార్ట్‌ఫోన్ చాలా ఖరీదైనది. విరాట్ కోహ్లీ ఐఫోన్ 15 ప్రో యొక్క 1 TB మోడల్‌ను ఉపయోగిస్తే, దాని ధర రూ. 1.5 లక్షల కంటే ఎక్కువ.

Also read: జులై 1 నుంచి అమల్లోకి కొత్త నేర చట్టాలు.. పూర్తి వివరాలు

దాదాపు 11 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు ఐసీసీ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. అలాగే 17 ఏళ్ల తర్వాత మళ్లీ టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకుంది. ఈ విజయం తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలతో సహా భారత ఆటగాళ్లు తమ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు