Virat Kohli :ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు రూ.11.45కోట్లు.. కోహ్లీ ఏమన్నాడంటే?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్‌ పోస్టుకు రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలపై టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించాడు. జీవితంలో తాను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటానని తెలిపాడు. ఇంకా ఏం అన్నాడంటే..

New Update
Virat Kohli :ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు రూ.11.45కోట్లు.. కోహ్లీ ఏమన్నాడంటే?

Virat Kohli About Rumours: టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక స్పాన్సర్డ్‌ పోస్టుకు ఏకంగా రూ.11.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్త హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. హోపర్ హెచ్‌క్యూ అనే కంపెనీ విడుదల చేసిన ఈ నివేదికపై తాజాగా కోహ్లీ స్పందిస్తూ ఓ ట్వీట్ చేశాడు. "జీవితంలో నేను అందుకున్న ప్రతిదానికి రుణపడి ఉంటాను. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అయితే నా సోషల్ మీడియా సంపాదన గురించి ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదు" అని స్పష్టంచేశాడు. అయితే నిజంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లను కలిగి ఉన్న భారత ఆటగాడు విరాట్ కోహ్లీనే కావడం గమనార్హం. ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లీకి ఏకంగా 25.5 కోట్ల ఫాలోయర్లు ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌(Instagram)లో 256 మంది మిలియన్లు ఉన్న కోహ్లీ (Virat Kohli) ఒక్కో పోస్ట్ ద్వారా భారీగానే సంపాదిస్తున్నాడని హోపర్ హెచ్‌క్యూ అనే సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. హోపర్ ఇన్‌స్టాగ్రామ్ రిచ్ లిస్ట్- 2023 పేరుతో ఇన్‌స్టాలో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్‌ 20 స్టార్స్‌ జాబితా పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం ఐదో స్థానంలో ఉన్న విరాట్.. ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కి రూ.11.45 కోట్లు అందుకుంటున్నాడు. ఇక అగ్రస్థానంలో ఉన్న ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో ఒక్కో స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు 3.23 మిలియన్లు(రూ.26.75 కోట్లు), రెండో స్థానంలో ఉన్న లియోనెల్‌ మెస్సీ ఒక్కో ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌కు 2.56 మిలియన్లు(రూ.21.49కోట్లు) అందుకుంటున్నారు. ఇండియా క్రీడాకారుల నుంచి కోహ్లీ ఒక్కడే ఈ లిస్టులో చోటు దక్కించుకోవడం విశేషం.

ట్విట్టర్‌లో ఒక్కో పోస్ట్‌కి రూ.3 కోట్ల వరకూ అందుకుంటున్న కోహ్లీ.. వివిధ స్టార్టప్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాడు. అలాగే మింత్రా, ఉబర్, ఎంఆర్‌ఎఫ్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, వివో వంటి డజనుకి పైగా బ్రండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో A+కేటగిరిలో ఉన్న కోహ్లీ.. ఏడాదికి రూ.7 కోట్లు అందుకుంటున్నాడు. ఒక్కో టెస్టు మ్యాచ్ ద్వారా రూ.15 లక్షలు, ఒక్కో వన్డే మ్యాచ్ ద్వారా రూ.6 లక్షలు, ఒక్కో టీ20 మ్యాచ్ ద్వారా రూ.3 లక్షలు తీసుకుంటున్నాడు. ఇవి కాకుండా ఐపీఎల్‌లో ఆర్‌సీబీ నుంచి రూ.16 కోట్లు పుచ్చుకుంటున్నాడు. ఇలా మొత్తంగా రెండు చేతులా కోట్లలో సంపాదిస్తున్నాడు కింగ్.

Also Read: గిన్నిస్‌ బుక్‌ రికార్డ్స్‌లో ధోనీ బ్యాట్.. నిజమేనా?

#virat-kohli #kohli #virat-kohli-about-rumours #virat-kohli-instagram-earnings #virat-kohli-earnings #kohlis-earnings-clarification #virat-kohli-denies-the-rumours
Advertisment
Advertisment
తాజా కథనాలు