Virat Kohli: 2024 టీ20 ప్రపంచకప్ జట్టు నుంచి విరాట్ కొోహ్లీ చేరిక వస్తున్న పుకార్లను భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ క్రిస్ శ్రీకాంత్ విమర్శించారు.
ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే జూన్ 1 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి వెస్టీండీస్, యూనైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాలు వేదిక గా జరగనుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ పై కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాలలో వస్తున్న పుకార్ల ను భారత మాజీ సెలక్షన్ కమిటీ చైర్మన్ క్రిస్ శ్రీకాంత్ విమర్శించారు.T20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ స్ట్రైక్ రేట్ గురించి గతంలో ఆందోళనలు ఉన్నాయి. T20 ప్రపంచ కప్ 2022లో, విరాట్ కోహ్లీ కేవలం 6 మ్యాచ్‌లలో 296 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌పై ఆడిన ఆటను ఇప్పటివరకు ఏ భారతీయుడు మరచిపోలేదు. నవంబర్ 2022 నుంచి కోహ్లీ కేవలం రెండు టీ20లు మాత్రమే ఆడాడు. ట్రోఫీని గెలవాలంటే జట్టుకు స్టార్ ప్లేయర్ అవసరమని అన్నారు. “అవకాశం లేదు. విరాట్ కోహ్లీ లేకుండా మనం టీ20 ప్రపంచకప్‌లో ఉండలేం. T20 వరల్డ్ కప్ 2022 సెమీ-ఫైనల్ వరకు మనల్నిఅతడే నడిపించాడు. టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవాలంటే విరాట్ కోహ్లీ జట్టులో తప్పక ఉండాలని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఖాతా ద్వారా తెలిపారు.
Also Read: ఎలక్టోరల్ బాండ్ కంట్రిబ్యూటర్లలో తెలుగువాళ్లే టాప్.. లిస్ట్ ఇదే!