Banana: సీజన్లతో సంబంధం లేకుండా.. ఎక్కడ పడితే అక్కడ చౌకగా దొరికేది ఒక్క అరటి పండు మాత్రమే. ఎన్నో పోషక విలువులున్న అరటి పండు మంచి ఆహారమే అయినప్పటికీ.. అతిగా తింటే అనర్థమేనంటున్నారు పోషకాహార నిపుణులు.
పరగడపున అరటి పండ్లు తింటే..
అమృత ఫలంగా గుర్తింపు పొందిన అరటి పండులో మెగ్నీషియం, పోటాషియం, పీచు మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.శరీరానికి తక్షణ శక్తిని అందించే అరటి పండును తీసుకునే క్రమంలో కొన్ని మెలకువలు పాటించాలంటున్నారు పోషకాహార నిపుణులు. అరటి పండును ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే సమస్యలొస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరగడపున అరటి పండ్లు తింటే...బాడీకి ఐరన్, జింక్, కాల్షియం పూర్తిస్థాయిలో అందవని చెబుతున్నారు. బ్రేక్‌ఫాస్టు, మధ్యాహ్న భోజనం తరువాత అరటిపండు తింటే అరగడం కష్టమంటున్నారు.
ఇది కూడా చదవండి: పొగాకు నిషేధిస్తే ఇంత మంది ప్రాణాలు కాపాడొచ్చా..?