Shocker: అత్యంత అమానవీయం.. గిరిజన యువకుడి ముఖంపై మూత్రం..! మధ్యప్రదేశ్‌లో అత్యంత అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఓ గిరిజన యువకుడి ముఖంపై కుబ్రికి చెందిన ప్రవేశ్ శుక్లా మూత్రం పోసిన వీడియో వైరల్‌గా మారింది. గిరిజనుడిపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘగనపై సీఎం చౌహాన్ దృష్టి సారించారు. అతని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయగా..అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Trinath 05 Jul 2023 in నేషనల్ Scrolling New Update షేర్ చేయండి అవతల వాళ్ల కులంపై చిన్నచూపో.. తానే బలవంతుడినన్న అహంకారమో తెలియదు కానీ మధ్యప్రదేశ్‌లో జరిగిన అత్యంత అమానవీయ ఘటన సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది. అసలు మనషులు ఇలా కూడా ఉంటారా అనిపించేలా.. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తున్న ఓ గిరిజన యువకుడి ముఖంపై ప్రవేశ్ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోయడంపై నెటిజన్లు మండిపడుతున్నార. సిగరెట్ తాగుతూ శుక్లా ఇలా చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. కుబ్రికి చెందిన ప్రవేశ్ శుక్లా ఈ పని చేసినట్టు పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎస్‌సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రవేశ్ శుక్లాను అరెస్ట్ చేశారు. గిరిజన యువకుడి ముఖంపై మూత్రం (screenshot from video) అందులో మధ్యప్రదేశ్ నంబర్ వన్: గణంకాల ప్రకారం గిరిజనులపై జరుగుతున్న దాడుల్లో మధ్యప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. దీనిపై ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్న సమయంలో ఈ ఘటన చౌహాన్ సర్కార్‌ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. ఆదివాసులపై మధ్యప్రదేశ్‌లో నిత్యం ఇలాంటి తరహా ఘటనలే జరుగుతున్నయన్న విమర్శలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. గతంలో సైతం గిరిజనులపై అనాగరిక చర్యలకు దిగిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉండగా.. కాంగ్రెస్ ఇదే విషయాన్ని పలుమార్లు విమర్శిస్తూ వస్తుంది. ఇటు ఈ ఘటనకు పాల్పడిన ప్రవేశ్ శుక్లా ఓ బీజేపీ ఎమ్మెల్యేకి సన్నిహితుడన్న ప్రచారం జరుగుతోంది. మాకు సంబంధం లేదు: బీజేపీ సిధి బీజేపీ ఎమ్మెల్యే కేదర్‌నాథ్ శుక్లా మనిషే ప్రవేశ్ శుక్లా అంటూ సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అటు కాంగ్రెస్ కూడా బీజేపీ టార్గెట్‌గా ఫైర్ అవుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సన్నిహితులు ఇలానే ఉంటారంటూ పొలిటికల్‌గా విరుచుకుపడుతోంది. ఈ ఆరోపణలపై కేదర్‌నాథ్ శుక్లా స్పందించారు. ప్రవేశ్ శుక్లా తమ పార్టీకి చెందినవాడు కాదు అని అసలు తమకు సంబంధమున్న వ్యక్తే కాదని కేదర్‌నాథ్ శుక్లా చెబుతున్నారు. ఇదంతా అబద్ధమని.. కేదరన్‌థ్ శుక్లాకు ప్రవేశ్ తెలుసంటూ బీజేపీ వ్యతిరక వర్గం ఆరోపిస్తోంది. మరోవైపు గిరిజనుడిపై బహిరంగంగా మూత్ర విసర్జన చేసిన ఘగనపై సీఎం చౌహాన్ దృష్టి సారించారు. అతని కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి