/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dog-viral-video-jpg.webp)
Trending Video: సోషల్ మీడియాలో ఓ వీడియో తుఫాను వ్యూస్ సంపాదిస్తోంది. ఓ కుక్క మరో కుక్కను రక్షిస్తోన్న ఓ వీడియోను ఇప్పటికే దాదాపు 4లక్షల మంది చూశారు. ఈ రెండు కుక్కలు చాలా మంచి ఫ్రెండ్స్. ఒకటి బ్లాక్ కలర్ డాగ్.. ఇంకోటి వైట్ కలర్ డాగ్. మనుషుల మధ్య ఈ కలర్ డిఫెరెన్సులు, రెసిజం ఉంటుంది కానీ కుక్కలకు అలాంటివేమీ తెలియదు. మనసు బాగుంటే ఓ కుక్క ఇంకో కుక్కతో ఫ్రెండ్‌షిప్ చేస్తుంది. ఆ ఫ్రెండ్‌షిప్ విలువ కట్టలేనిదిగా ఉంటుంది. ఈ వీడియో చూస్తే ఆ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది.
కొమ్మతో కుక్క సాహసం:
తన స్నేహితుడిని మునిగిపోకుండా రక్షించడానికి ఓ కుక్క సాహసం చేసింది. ఈ వీడియో రెండు కుక్కల మధ్య అద్భుతమైన బంధాన్ని చూపుతుంది. ఒక సాహసోపేతమైన కుక్క ఒక కొమ్మను తిరిగి పొందేందుకు ఉత్సాహంగా నదిలోకి దూకినట్లుగా ఫుటేజీలో కనిపిస్తోంది. అయితే బలమైన ప్రవాహానికి కుక్క కంట్రోల్ తప్పింది. దీంతో కొట్టుకుపోయింది. ఇక ఇంతలోనే మరో కుక్క తన ఫ్రెండ్‌ను కాపాడేందుకు అక్కడికి వస్తుంది. ఒక పొడవైన కొమ్మను పట్టుకుని నదిలో కొట్టుకుపోతున్న కుక్కను కాపాడుతోంది.
వీడియోను కింద చూడండి:
A dog saves his friend from the raging waters pic.twitter.com/RDH7ObyNff
— Gabriele Corno (@Gabriele_Corno) February 28, 2024
Also Read: మళ్ళీ సస్పెన్స్ పోస్ట్ పెట్టిన ధోనీ..ఈసారి దేని గురించో!