మెగా ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్‌.. 'క్లింకార' ఫస్ట్‌ లుక్‌..!

రామ్ చరణ్-ఉపాసన కూతురు క్లింకారకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. క్లింకార ముఖం పూర్తిగా కనిపించకున్నా ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు. తన చిట్టి చేతులతో మువ్వన్నెల జెండా తాడును పట్టుకున్న క్లింకార ఫొటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేశారు ఉపాసన. గత జూన్‌ 20న మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది క్లింకార.

New Update
మెగా ఫ్యాన్స్‌కు అదిరే ట్రీట్‌.. 'క్లింకార' ఫస్ట్‌ లుక్‌..!

'ఎంత క్యూట్‌గా ఉందో'.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్‌లో ఎవరి నోటా విన్నా ఇదే మాట వినిపిస్తోంది. క్లింకార పుట్టిన దగ్గరి నుంచి ఆమె ఫొటో కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కి అదిరే ట్రీట్ ఇచ్చింది మెగా ఫ్యామిలీ. తాజాగా మెగా ప్రిన్సెస్‌ క్లింకార ఫొటోను షేర్‌ చేశారు ఉపాసన. క్లింకార జాతీయ జెండాను ఎగురవేస్తున్న ఫోటోను సోషల్‌ మీడియా ద్వార పంచుకున్నారామె. అమ్మమ్మ శోభా కామినేని, తాతయ్య అనిల్‌ కామినేనిలతో కలిసి పంద్రాగస్ట్‌ వేడుకల్లో పాల్గొంది క్లింకార. వారి ఫామ్‌హౌస్‌లో జరిగిన వేడుకల్లో అమ్మమ్మ, తాతయ్యలు క్లింకారను ఎత్తుకొని జెండా ఎగురవేయించారు.


భలే క్యూట్‌గా ఉందే:
రామ్‌చరణ్‌, ఉపాసన దంపతులకు 2012లో మ్యారేజ్‌ జరిగింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన. జూన్‌ 20న మెగా ఫ్యామిలీలోకి అడుగుపెట్టింది క్లింకార. ఎప్పటికప్పుడు క్లింకార గురించిన విషయాలను సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ఉంటారు ఉపాసన. తాజాగా తన చిట్టి చేతులతో మువ్వన్నెల జెండా తాడును పట్టుకున్న క్లింకార ఫొటోలను తన సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేశారు ఉపాసన. అవి వెలకట్టలేని క్షణాలు..అమ్మమ్మ, తాతయ్యతో కలిసి తన బంగారు తల్లి..ఫస్ట్‌ ఇండిపెండెన్స్‌డే జరుపుకుందంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. క్లింకార ఫొటోస్‌ చూసిన మెగా ఫ్యాన్స్‌..క్యూట్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాసన..క్లింకారను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘క్లింకార పుట్టిన తర్వాత నా జీవితం ఎంతో మారింది. ఇప్పుడెంతో ఆనందంగా ఉన్నా. తన వల్ల ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని చెప్పారు. మరోవైపు రామ్ చరణ్, ఉపాసన అభిమానులు కామెంట్ సెక్షన్‌లో క్లింకారపై ప్రేమను కురిపిస్తున్నారు. క్లింకారకు సంబంధించిన ఫొటో గ్లింప్స్‌ ప్రస్తుతం అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతుంది. ఇందులో క్లీంకార ముఖం పూర్తిగా కనిపించకున్నా ఫ్యాన్స్ మాత్రం ఖుషీ అవుతున్నారు.

Advertisment
తాజా కథనాలు