ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. లడసాహి పోలీస్ స్టేషన్ పరిధిలోని బన్సాహి గ్రామానికి చెందిన మధుస్మిత సింగ్ అనే యువతి అనారోగ్యం బారిన పడింది. మధుస్మిత కుటుంబ సభ్యులు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. మధుస్మిత మృతదేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు కుటుంబసభ్యులు స్వగ్రామానికి తీసుకువచ్చారు. చితికి నిప్పు పెట్టిన కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పుడే దంత్ని గ్రామానికి చెందిన సుందర్ మోహన్ సింగ్, నరేంద్ర సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు శ్మశానవాటిక వద్దకు వచ్చారు. వీరిద్దరు కాలిన యువతి మృతదేహంలోని మాంసం తింటున్నారని గ్రామస్థులకు, మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందింది.
ఇద్దరు నిందితులను చితకబాదిన గ్రామస్థులు
శ్మశానం దగ్గర వచ్చిన గ్రామస్థులు.. ఇద్దరు నిందితులను చితకబాది బంధించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న లడసాహి పోలీసులు.. నిందితులిద్దర్ని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకడైన సుందర్ మోహన్.. చుట్టుపక్కల గ్రామాల్లో కూలీ పనులు చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. అలాగే నిందితులిద్దరూ మద్యం మత్తులో ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల క్రితం రాజస్థాన్లోని పాలీ జిల్లాలో అచ్చం ఇలాంటి ఘటనే జరిగింది. 60 ఏళ్ల వృద్ధురాలిపై రాళ్లతో దాడి చేసి చంపేశాడు ఓ యువకుడు. ఆ తర్వాత ఆమె తలలోని మాంసాన్ని తింటూ కూర్చున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అతడిని అరెస్ట్ చేశారు. మృతురాలిని శాంతి దేవిగా గుర్తించారు.
శవం తల మాంసాన్ని పీక్కుతిన్న నిందితులు
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మయూర్భంజ్ జిల్లాలోని శారధన గ్రామానికి చెందిన 60 ఏళ్ల శాంతి దేవి అనే మహిళను 24 ఏళ్ల వ్యక్తి చంపేశాడు. అనంతరం ఆమె తలలోని మాంసాన్ని తిన్నాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న గొర్రెల కాపరులు అది చూసి భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అక్కడి నుండి నిందితుడు పరారయ్యాడు.