Priyanka Chopra: ప్రియాంక చోప్రా మెడలోని నెక్లెస్ వైరల్!

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మెడలోని నక్లెస్ పైనే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చర్చసాగుతుంది.

New Update
Priyanka Chopra: ప్రియాంక చోప్రా మెడలోని నెక్లెస్ వైరల్!

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మెడలోని నెక్లెస్ పైనే ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం చర్చసాగుతుంది.

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నిత్యం సామాజిక మాధ్యమాలలో వార్తల్లో నిలుస్తుంటారు. పబ్లిక్ లో ఆమె  కనిపించిన ప్రతిసారి ఫొటో గ్రాఫర్లు ఉత్సాహంగా ఉంటారు. గురువారం సాయంత్రం తన కూతురు మార్టీ మేరీ చోప్రా జోనాస్ తో కలసి ముంబయి చేరుకున్నారు. శుక్రవారం ముంబయి లో జరిగిన ఓ కార్యక్రమంలో తళుకుమన్నారు. ప్రియాంక చోప్రా  మెడలో నెక్లెస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రియాంక బ్వల్గారీ  బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. ఆమె ఎక్కడ కనపడిన ఆ నగలను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. శుక్రవారం ముంబయి లో జరిగిన కార్యక్రమంలో బ్వల్గారీ  డైమండ్స్‌తో కూడిన రోజ్ గోల్డ్ సర్పెంటైన్ నెక్లెస్ ను  ప్రియాంక ధరించింది. దీంతో ఒక్కసారిగా నెట్టింట వైరల్ గా మారింది. ఆమె ధరించిన నెక్లెస్ ధర అక్షరాల  58 లక్షల 65వేల రూపాయలు అని తెలియటంతో చాలా మంది సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు