First Date Tips: ఈ అమ్మాయి అడిగే ప్రశ్నకు భయపడిపోతున్న అబ్బాయిలు.. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..

చూసేందుకు పాలరాతి శిల్పంలా ఉంటుంది ఈ అమ్మాయి. అందుకే సోషల్ మీడియాలో స్టార్‌గా నిలిచింది. ఈ బ్యూటీతో డేటింగ్ కోసం ఎంతో మంది ట్రై చేస్తారు. కానీ, ఆ అమ్మాయి అడిగే తొలి ప్రశ్నతో బిత్తర పోతున్నారు అబ్బాయిలు. మరి ఆ అమ్మాయి అడుగుతున్న ప్రశ్నేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

First Date Tips: ఈ అమ్మాయి అడిగే ప్రశ్నకు భయపడిపోతున్న అబ్బాయిలు.. ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే..
New Update

Viral News: ఫస్ట్ డేట్‌ ఏ అమ్మాయికైనా.. అబ్బాయికైనా చాలా ప్రత్యేకం. డేటింగ్(Dating) సమయంలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా ఫస్ట్ డేట్‌(First Date)లో వ్యక్తులు తమకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ఒకరికొరు షేర్ చేసుకోరు. చిన్న చిన్న అంశాల నుంచి ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. అలా ఒకరి గురించి మరొకరు మెల్లగా తెలుసుకుంటారు. కానీ, ఓ అమ్మాయి మాత్రం ఫస్ట్ డేట్‌లోనే అబ్బాయిలను హడలెత్తిస్తోంది. ఇలాంటి ప్రశ్న అడుగుతుందేంట్రా బాబూ.. ఇదేదో తేడా ఉందంటూ అబ్బాయి భయంతో పారిపోతున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నేంటి? అబ్బాయిలు ఎందుకు భయపడ్డారు. వెరీ ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా అమ్మాయిలు అబ్బాయితో డేట్‌కి వెళ్లినప్పుడు వారి ప్రవర్తన ఎలా ఉంది? ఇతరులతో వారు ఎలాంటి ప్రవర్తిస్తున్నారు? ఎలాంటి ఇంటరాక్ట్ అవుతున్నారు? బిల్లు చెల్లిస్తాడా? లేక మనతోనే కట్టిస్తారా? వంటి చిన్న చిన్న అంశాలను ముందుగా గమనిస్తారు. కానీ, ఈ అమ్మాయి మాత్రం తనతో డేట్‌కు వచ్చిన అబ్బాయిలను ఓ ప్రశ్న అడుగుతుందట. అది విని అబ్బాయిలు కంగారుపడిపోతారట. ఈ విషయాన్ని స్వయంగా ఆ అమ్మాయే వెల్లడించింది. సోఫియా ఫ్రాంక్లిన్.. టిక్‌టాక్ స్టార్‌గా ఎంతో ఫేమస్. తన పోడ్‌కాస్ట్ లేటెస్ట్ ఎపిసోడ్‌లో చాలా ఇంట్రస్టింగ్ వివరాలను వెల్లడించింది.

ఈ డీటెయిల్స్ అడుగుతుందట..

సోఫియా ఫ్రాంక్లిన్ తన లేటెస్ట్ ఎపిసోడ్‌లో తాను ముగ్గురు యువకులతో డేట్‌కు వెళ్లిందట. అయితే, ముగ్గురు యువకులనూ ముందుగా వారి వారి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన సమాచారాన్ని అడుగుతుందట. వాస్తవానికి తన ఉద్దేశ్యం ఏంటంటే.. వారు ఎంత సంపాదిస్తున్నారు? వారు ధనవంతులా? కాదా? అనే విషయాన్ని తెలుసుకునే ఉద్దేశ్యంతోనే ఆ ప్రశ్న అడిగేదానినని చెబుతోంది సోఫియా. ఈ ప్రశ్న అడగటానికి ఓ కారణం ఉందని చెబుతోంది సోఫియా.

వారితో మాత్రమే డేట్‌కు వెళ్తుందట..

డేట్ విషయంలో సోఫియా చాలా క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. తాను ధనవంతులతో మాత్రమే డేట్‌కు వెళ్తానని స్పష్టంగా చెబుతోంది. 'నాకు జాబ్, డబ్బు ఉన్నాయని అందరికీ తెలుసు. నేను చాలా సక్సెస్ అయ్యాను. అందుకే మన ఎదుటి వ్యక్తి కూడా అదే స్థాయిలో ఉన్నాడా? లేక డేటింగ్ చేస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నానా? అని తెలుసుకోవాలనుకుంటాను. అందుకే, బ్యాంక్ వివరాలు తెలుసుకుంటాను. అది నా హక్కు.' అంటోంది సోఫియా. అయితే, సోఫియా అభిప్రాయంపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇలాంటి పద్ధతి సరికాదని అంటున్నారు. ఆమె తీరుపై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అబ్బాయిలు కూడా అమ్మాయిల విషయంలో ఇలాగే ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు. మొత్తానికి టిక్ టాక్ వేదికగా సోఫియా పెట్టిన వీడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read:

Viral Video: చిరుతపులితో సెల్ఫీలు..ఓరి..మీ వేషాలో.. ఎగిరి తంతే ఏట్లో పడతారు!

financial: ఆర్థిక ఇబ్బందులకు ఇవే కారణం..ఎవరినైనా నమ్మితే అంతే సంగతులు!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe