మణిపూర్ లో హింస ఆగడం లేదు. రాజధాని ఇంఫాల్‌లోని కొంగ్బాలో హింసాత్మక సంఘటన వెలుగులోకి వచ్చింది. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి అర్థరాత్రి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటన జరిగిన సమయంలో కేంద్రమంత్రి ఇంట్లో లేరు.
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇంఫాల్‌లోని కొంగ్బాలో కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ ఇంటికి కొందరు ఆందోళనకారలు నిప్పు పెట్టారు. ఘటన జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఇంట్లో లేరని అధికారులు తెలిపారు.
అయితే ఈ ఘటనపై కేంద్రమంత్రి రంజన్ సింగ్ స్పందించారు. నా సొంత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఇప్పటికీ శాంతి కోసం విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. ఇలాంటి హింసకు పాల్పడే వ్యక్తులు పూర్తిగా అమానుషం. ప్రస్తుతం అధికారిక పని నిమిత్తం కేరళలో ఉన్నాను. అదృష్టవశాత్తూ గత రాత్రి ఇంఫాల్ లోని నా ఇంట్లో ఎవరూ గాయపడలేదు. దుండగులు పెట్రోల్ బాంబులు విసరడంతో నా ఇంటి మొదటి అంతస్తు పూర్తిగా ధ్వంసం అయ్యిందంటూ ట్వీట్ చేశారు.