/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-14T124807.503-jpg.webp)
Vindhya Vishaka About Her Modelling Days: ప్రముఖ తెలుగు ప్రెజంటర్ వింధ్యా విశాఖ తన జీవితంలో ఎదురైన ఓ సంచలన విషయం బయటపెట్టింది. ఐపీఎల్, ప్రొకబడ్డీ లీగ్‌లకు యాంకరింగ్ చేస్తూ భారీ ఫాలోయింగ్ సంపాదించుకన్న వింధ్యా.. ఫ్యాషన్ షోలో పాల్గొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది.
బోలెడంత ప్రేమతో, మీకు ఇంకా దగ్గరవ్వటానికి చేసిన ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తూ
మీ వింధ్య విశాఖ 🙏
And on the Telugu New Year my journey starts as a Youtuber :) @smtollywood @sillymonksnt #newbeginnings #youtuber #vindhyavishaka #vlogs https://t.co/HfZiiMzQgr pic.twitter.com/zOmzJx4Df8— Vindhya Vishaka Medapati (@VindhyaVishaka) April 13, 2021
కాలేజీ రోజుల్లోనే న్యూస్ రీడర్..
ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. కాలేజీ రోజుల్లోనే న్యూస్ రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే కొంతకాలానికి మోడలింగ్‌లోనూ శిక్షణ పొందానని చెప్పింది. 'కాలేజీ రోజుల్లో పలు అందాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచాను. అప్పుడే మోడలింగ్ చేయాలనే ఆలోచన మొదలైంది. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ మోడలింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నా' అని చెప్పింది.
View this post on Instagram
ఈ క్రమంఓనే ఒకసారి హైదరాబాద్‌లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నప్పుడు ఊహించని అనుభవం ఎదురైంది. ఆడపిల్లలు బట్టలు మార్చుకోవడానికీ గదులు లేదు. బ్యాక్ స్టేజ్‌లో అందరి ముందు మార్చుకోవడం చూసి కంగుతిన్నా. దీంతో ఆ రంగం నాకు సెట్ కాదని అర్థమైంది. వెంటనే మోడలింగ్ వదిలేశా. అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ షో అంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ అసహానికి గురైంది.
Also Read: ప్రాణం చల్లబడాలని ఐస్ క్రీమ్స్ లాగించేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి..