గుక్కెడు మంచినీరు కోసం రోడ్డెక్కిన గ్రామస్ధులు..!

తాగేందుకు గుక్కెడు మంచినీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రకాశం జిల్లా మిట్టపాలెం గ్రామస్ధులు వాపోతున్నారు. మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని ఎంపీడీఓకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుక్కెడు మంచినీరు కోసం రోడ్డెక్కిన గ్రామస్ధులు..!
New Update

Prakasam district: ప్రకాశం జిల్లా కొండపి మండలం మిట్టపాలెం గ్రామంలో దయనీయ పరిస్థితి కనిపిస్తోంది. 6 నెలల నుండి తాగేందుకు సరైన మంచినీరు లేదని గ్రామస్థులు వాపోతున్నారు. కరెంట్ కూడా ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో అసలు అధికారులే కనిపించడం లేదని వ్యాఖ్యనిస్తున్నారు. గ్రామ సెక్రటరీ సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసన చేపట్టారు మహిళలు. తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు.

Also read: జనసేన పార్టీకి బిగ్ షాక్..!

రాజకీయ కక్షతోనే ట్యాంక్ నుండి త్రాగు నీటిని గ్రామంలోకి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని కొండపి ఎంపీడీఓకు నాలుగు సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాలంటర్లను కూడా లేరని తెలిపారు. ఒకరోజు నీరు ఇస్తే వారంపాటు ఆపుతున్నారన్నారు. దీంతో కనీస అవసరాలకు నీరు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

This browser does not support the video element.

Also Read: తెలంగాణ స్పూర్తితోనే ఏపీలో గుండాలను, రౌడీలను ఎదుర్కొంటున్నా: పవన్‌ కళ్యాణ్‌

పశువులు త్రాగటానికి నీరు లేక ఆల్లాడి పోతున్నాయని వాపోయారు. పసిపిల్లలకు సరిపడ నీరు ఉండడం లేదని ఫైర్ అవుతున్నారు. గ్రామంలో ట్యాంక్ ద్వారా వచ్చే నీటికి రాజకీయం ఏంటని విరుచుకుపడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి.. మంచీటిని అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read: తమిళ స్టార్ హీరో సూర్యకు ప్రమాదం..ఆందోళనలో ఫ్యాన్స్.!

#andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe