వీఓఏలకు సీఎం రక్షాబంధన్ కానుక : సెప్టెంబరు నుంచి పెంచిన వేతనాలు

మహిళా సంఘం సహాయకు ( వీ వో ఏ) లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక ఇచ్చారు. వారి నెల జీతాలు పెంచుతూ సిఎం నిర్ణయం తీసుకున్నారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తక్షణమే జీఓ జారీ అయ్యింది.

New Update
వీఓఏలకు సీఎం రక్షాబంధన్ కానుక : సెప్టెంబరు నుంచి పెంచిన వేతనాలు

Village organisation assistants salaries getting hiked: రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీ వో ఏ) ల వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం  నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ. 8000 కు పెరగనున్నాయి.  దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకు ( వీ వో ఏ) లకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ. 106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనుంది.  ఖర్చుకు వెనకాడకుండా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సిఎం మానవీయ కోణంలో వేతన పెంపు నిర్ణయం తీసుకున్నరని అధికారులు పేర్కొన్నారు.

publive-image

ఇతర విజ్జప్తులనూ అంగీకరించిన సిఎం

తమ జీతాలు పెంచాలని, తమకు యూనిఫాం కోసం నిధులను అందించాలని, తమకు ప్రతి మూడునెల్లకోసారి అమలవుతున్న రెన్యూవల్ విధానాన్ని సవరిస్తూ దాన్ని ఏడాదికి పెంచాలని, విజ్జప్తులను తక్షణమే పరిష్కరిస్తూ సిఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తమకు జీవిత బీమా కూడా అమలు చేయాలనే మహిళా సంఘాల సహాయకుల విజ్జప్తికి సిఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఏడాదికి రూ. 2 కోట్లు నిధులను అందిస్తామని ప్రకటించారు. ప్రతి మూడు నెలలకు ఓసారి అమలయ్యే  రెన్యూవల్ విధానాన్ని,  ఇకనుంచి ఏడాదికి చేసేలా సవరిస్తామని పేర్కొన్నారు.

publive-image

సీఎం నిర్ణయాలను వెల్లడించిన హరీష్ రావు 

మహిళా సంఘాల ప్రతినిధులతో సమావేశమై అధికారికంగా ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని మంత్రి హరీశ్ రావు కు సీఎం సూచించారు. ఈ మేరకు సహచర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతీ రాథోడ్ లతో కలిసి మహిళా సంఘాల సహాయకులతో మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. సీఎం నిర్ణయాలను మంత్రి హరీశ్ రావు వారికి వెల్లడించారు.

సంబరపడిన వివోఏలు

జీతాలు పెంచుతూ జారీ అయిన ప్రభుత్వ ఉత్తర్వుల కాపీని మహిళా సంఘాల ప్రతినిధులకు అందచేశారు. దీనితో వారు ఆనందం వ్యక్తం చేస్తూ
మంత్రులకు రాఖీలు కట్టి తమ కృతజ్జతలు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు