మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి.... చంద్రునికి మరింత దగ్గరగా విక్రమ్ ల్యాండర్...!

చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండింగ్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియను(కక్షను మరింత తగ్గించుకుంది) పూర్తి చేసుకుంది. దీంతో ల్యాండర్ చంద్రునికి మరింత సమీపంలోకి చేరుకుంది. ఈ నెల 23న ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

author-image
By G Ramu
New Update
మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియ పూర్తి.... చంద్రునికి మరింత దగ్గరగా విక్రమ్ ల్యాండర్...!

చంద్రయాన్-3 మిషన్ తుది దశకు చేరుకుంది. చంద్రయాన్ మిషన్ ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ల్యాండింగ్ మాడ్యుల్ నిన్న వేరుపడింది. తాజాగా చంద్రయాన్-3 మిషన్ లోని విక్రమ్ ల్యాండింగ్ మొదటి డీ బూస్టింగ్ ప్రక్రియను(కక్షను మరింత తగ్గించుకుంది) పూర్తి చేసుకుంది. దీంతో ల్యాండర్ చంద్రునికి మరింత సమీపంలోకి చేరుకుంది. ఈ నెల 23న ల్యాండర్ చంద్రునిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉన్నట్టు ఇస్రో వర్గాలు వెల్లడించాయి.

తాజాగా చంద్రయాన్-3 కి సంబంధించిన విషయాలను ఇస్రో ట్వీట్ చేసింది. ప్రస్తుతం ల్యాండర్ మాడ్యుల్ బాగానే పని చేస్తోందని ఇస్రో వెల్లడించింది. తాజాగా ల్యాండర్ మాడ్యుల్ డీ బూస్టింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకుందని వెల్లడించింది. దీంతో ల్యాండర్ కక్ష 113 కిమీX157కిలో మీటర్లకు తగ్గినట్టు ఇస్రో ట్వీట్ చేసింది.

ఈ నెల 20న ల్యాండర్ డీ బూస్టింగ్ రెండవ ఆపరేషన్ జరుగుతుందని వివరించింది. నేటి నుంచి మరో ఐదు రోజుల్లో అనగా అగస్టు 30న విక్రమ్ ల్యాండర్ పెరీలూన్ ప్రాంతం(చంద్రునికి అత్యంత సమీప ప్రాంతం) చేరుకుంటుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అది చంద్రునికి 30 కిలో మీటర్ల దూరంలో వుంటుందని చెప్పారు. అక్కడి నుంచి విక్రమ్ చంద్రునిపై ఫైనల్ ల్యాండింగ్ కు ప్రయత్నాలు చేస్తుందన్నారు.

విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండింగ్ అయితే ఈ ఘనత సాధించిన నాలుగవ దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. ఇది ఇలా వుంటే విక్రమ్ ల్యాండర్ చంద్రునికి సంబంధించిన వీడియోలను పంపించింది. చంద్రునిపై క్రేటర్లు వున్నట్టుగా విక్రమ్ పంపిన ఫోటోల్లో కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు