శిరీష కేసులో వీడిన మిస్టరీ! By Trinath 14 Jun 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి వికారాబాద్ లో జరిగిన శిరీష హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 19 ఏళ్ల అమ్మాయిని అత్యంత దారుణంగా చంపిన తీరు గ్రామం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేసింది. అసలు శిరీషను ఎవరు చంపారు..? ఎందుకు చంపారో మిస్టరీగా మారింది. తాజాగా పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. శిరీషను బావ అనిల్ అత్యంత దారుణంగా చంపాడని తేల్చారు పోలీసులు. వికారాబాద్ జిల్లా కాళ్లాపూర్ గ్రామానికి చెందిన శిరీష ఇంటర్ పూర్తి చేసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. తల్లి యాదమ్మ అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు శిరీష అన్న శ్రీకాంత్ హైదరాబాద్ లో కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నాడు. ఇంటి వద్ద తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ ఉంటున్నారు. భోజనానికి ఇబ్బంది అవుతోందని భావించిన తండ్రి.. రెండు నెలల కిందట కుమార్తెను కాళ్లాపూర్ కు రప్పించాడు. ఆమె తమ్ముడు శ్రీనివాస్ శనివారం రాత్రి పరిగిలో ఉంటున్న తన మరో అక్క భర్త అనిల్ కు ఫోన్ చేసి.. శిరీష వంట చేయడం లేదని తెలిపాడు. దీంతో వెంటనే కాళ్లాపూర్ వచ్చిన అనిల్.. శిరీషను మందలించి ఆమెపై చేయి చేసుకున్నాడు. ఇదే విషయమై తండ్రి కూడా శిరీషను కొట్టడంతో ఆమె మనస్తాపానికి గురై రాత్రి పదిన్నర తరువాత ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం గ్రామానికి కిలోమీటరు దూరంలోని నీటికుంటలో విగతజీవిగా కనిపించింది. శిరీష అన్న శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద హత్యకేసుగా నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టి చేధించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ కరుణా సాగర్ రెడ్డి, సీఐ వెంకట్రామయ్య సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత ఆమె తండ్రి జంగయ్య, అక్క భర్త అనిల్ ను తమదైన శైలిలో పోలీసులు విచారించగా అసలు నిజం బయటపడింది. శిరీష బావ ఆమెను దారుణంగా హతమార్చినట్టు పోలీసు విచారణలో వెల్లడైంది. ఆరోజు రాత్రి ఫోన్ ఎక్కువగా వాడుతున్నావ్ అంటూ శిరీషను ఆమె అన్నయ్య తిట్టాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటికొచ్చిన బావ అనిల్ కూడా ఆమెను కొట్టాడు. దీంతో మనస్థాపం చెందింది. అర్థరాత్రి కలుద్దామని చెప్పి, శిరీషను అనిల్ బయటకు పిలిచాడు. అందరూ పడుకున్న తర్వాత.. శిరీష ఇంటి తలుపుని బయట నుంచి గడియపెట్టి బయటకు వెళ్లింది. ఇద్దరు కలుసుకున్న తర్వాత మళ్లీ గొడవ జరిగింది. అక్కడే శిరీషపై మళ్లీ చేయి చేసుకోని మద్యం మత్తులో అనిల్, అతని స్నేహితులు బీరు బాటిల్ తో కళ్లలో గుచ్చారు. ఆ సమయంలో తనను వదిలేయాలని శిరీష ఎంత వేడుకున్నా వదలలేదు. మోకాలు లోతు నీరున్న కుంటలో శిరీషను విసిరేశారు. ఆమె చనిపోయే వరకు శరీరంపై నిల్చున్నారు. చనిపోయిందని నిర్దారించుకున్నాక.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వారికి ఏం తెలియనట్టు శిరీష కోసం వెతుకుతున్నట్లు నటించారు. నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి