vijayawada: మేము దేనికైనా సిద్ధం..ఎక్కడికి రామంటావ్‌ జగన్‌: బుద్దా వెంకన్న

విజయవాడలో చంద్రబాబు అక్రమ అరెస్టులకు నిరసనగా ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న వన్ టౌన్ వినాయకుడి గుడి దగ్గర 101 కొబ్బరికాయలను కొట్టి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

vijayawada: మేము దేనికైనా సిద్ధం..ఎక్కడికి రామంటావ్‌ జగన్‌: బుద్దా వెంకన్న
New Update

జగన్ చూడలేదు.. వినలేదు..  న్యాయం చెప్పలేడు

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో  టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులకు నిరసనగా ఉత్తరాంధ్ర ఇన్చార్జి బుద్దా వెంకన్న వన్ టౌన్ వినాయకుడి గుడి దగ్గర 101 కొబ్బరికాయలను కొట్టి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా బుద్ద వెంకన్న మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి కళ్ళు ఉండి నాయ్యం చూడలేడు.. చెవులు ఉండి న్యాయం వినలేడు.. నోరు ఉండి న్యాయం చెప్పలేడు అంటూ ఘటుగా విమర్శలు చేశారు. జగన్ బతుకే అవినీతి మాయం.. ఆ అవినీతిలో నుంచి వచ్చిన పార్టీయే వైస్సార్సీపీ పార్టీ అంటూ మండిపడ్డారు.

This browser does not support the video element.

బురద చల్లే ప్రయత్నం

జగన్ ఒక దొంగ, జగన్ పై ఉన్న మచ్చా చంద్రబాబుకు కూడా ఉండాలని అక్రమ అరెస్ట్ చేశారు. చంద్రబాబు మీద బురద చల్లే ప్రయత్నం చేశాడని ఆరోపించారు. జగన్ నువ్వు ఒక సైకో నిన్ను చంచల్ గూడా జైల్లో కాదు.. తిహార్ జైల్లో పడేయాలి అంటూ జగన్‌పై కామెంట్స్‌ చేశారు. నీకు జైలు జీవితం కాయం జగన్ మోహన్ రెడ్డి. సామాన్య ఖైదీ లాగా చంద్రబాబుని ట్రీట్ చేయడం చాలా దారుణం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచోడి చేతికి రాయి ఇచ్చారని ఫైర్‌ అయ్యారు.

This browser does not support the video element.

మేము దేనికైనా సిద్ధం

మరోవైపు లోకేష్ యువగళం పాదయాత్ర పై కుట్ర జరుగుతుందని టీడీపీ నేత బుద్దా వెంకన్న కీలక వాఖ్యలు చేశారు. సీఎం జగన్ అవినాష్ కుటుంబ సభ్యులను పరామర్శించడం వెనుక కుట్ర ఉందన్నారు. అవినాష్‌ను రెచ్చగొట్టడానికే జగన్ ఆయన ఇంటికి వెళ్ళాడన్నారు. అవినాష్‌ను మరోసారి బలిపశువు చేయాలని జగన్ చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. జగన్ ఎప్పుడు హోటల్ ప్రారంభోత్సవాలు చేయలేదు.. గన్నవరం సభ, లోకేష్ పాదయాత్రలో అల్లర్లు సృష్టించడానికి అవినాష్ ఇంటికెళ్లారని మండిపడ్డారు. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం.. దాడి చేస్తే... మేము దాడి చేస్తాం.. అవాంఛనీయ సంఘటనలు సృష్టిస్తే.. ఎదుర్కోవడానికి మేము సిద్ధమన్నారు.

This browser does not support the video element.

#buddha-venkanna #were-struck-near-the #ready-for-anything #where-to-ramantao-jagan #vinayaka-temple
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe