/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/b-1-jpg.webp)
Vijayawada: విజయవాడ టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్ట్ ,రిమాండ్ ను నిరసిస్తూ దుర్గమ్మ దర్శనానికి వెళ్తున్న టీడీపీ నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ముందస్తు అరెస్టులు నిరసిస్తూ పోలీసుల ముందే కొబ్బరికోయాలు కొట్టారు టీడీపీ నేతలు. దుర్గమ్మకు కొట్టాల్సిన కొబ్బరికాయలు పోలీసులకు కొట్టారు. అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి అనుమతి లేదంటూ టీడీపీ నేతను అడ్డుకోవడంపై టీడీపీ శ్రేణలు మండిపడుతున్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయ్యి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై అక్రమ కేసులు బనాయించారని, కక్ష సాధింపు చర్యలలో భాగంగానే చంద్రబాబు అరెస్ట్ జరిగిందని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై మండిపడుతున్నారు. చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు. చంద్రబాబు జైలు పాలు కావటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తునే ఉన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి నేడు న్యాయస్థానాల్లో కీలక విచారణలు జరగనున్నాయి. ఏసీబీ కోర్టు తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు.