Vijayawada: విజయవాడలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో వర్షం మళ్లీ మొదలైంది. గంట నుంచి వర్షం కురుస్తుండడంతో విజయవాడ వాసులు వరద భయంతో వణుకుతున్నారు. ఇప్పటికే సింగ్‌నగర్, చిట్టినగర్, రెడ్డికాలనీ, ఊర్మిళనగర్‌లో వర్షపు నీరు నిండి ఉంది. పలు కాలనీల్లో వరద పోకముందే వర్షం పడడంతో కాలనీ వాసుల్లో ఆందోళన మొదలైంది. బెజవాడ వాసులకు ఈ జడివాన కంటి మీద కునుకులేకుండా చేస్తుంది.
Also Read: అల్లు అర్హ ఎంత చక్కగా గణపతి పూజ చేసిందో చూశారా.? వీడియో షేర్ చేసిన బన్నీ
అయితే, విజయవాడలో వరదలకు కారణమైన బుడమేరు గండ్లను అధికారులు ఇప్పటికే పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ కారణంగానే విజయవాడను వరద ముంచెత్తింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు ఆర్మీ సాయం తీసుకుని బుడమేరు గండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు.