Radha: బెజవాడ రాజకీయాలు.. వంగవీటి దారెటు..? అనుచరులతో రాధ సమావేశం

బెజవాడ రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్‌ అయ్యేందుకు వంగవీటి రాధా రెడీ ఐనట్టే కనిపిస్తోంది. ఇవాళ (ఆగస్టు 10) తన అనుచరులతో రాధా భేటీ కానున్నారు. ఈ మీటింగ్‌ తర్వాత రాధా రాజకీయ అడుగులు ఎటువైపన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు నారా లోకేశ్‌ పాదాయాత్ర కోసమే ఈ మీటింగ్‌ అని మరో వాదన వినిపిస్తోంది. మరికొన్ని రోజుల్లోనే లోకేశ్‌ పాదయాత్ర ఎన్టీఆర్‌ జిల్లాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

New Update
Radha: బెజవాడ రాజకీయాలు.. వంగవీటి దారెటు..? అనుచరులతో రాధ సమావేశం

Will Vangaveeti Radha going to join Janasena? : ఏపీ(AP)లో ఎన్నికలకు 8-9 నెలల సమయమే ఉండడంతో వంగవీటి రాధ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అందులోనూ వచ్చే ఏడాది ఎన్నికల్లో కాపుల ఓట్లు కీలకం కానున్నాయి.. విజయవాడ గడ్డపై చెరగని ముద్ర వేసిన వంగవీటి కుటుంబం ఈ సారి ఏ పార్టీ తరుఫున నిలబడుతుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొన్న వేళ.. ఇవాళ (ఆగస్టు 10) తన ముఖ్య అనుచరులతో వంగవీటి రాధ సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించే అవకాశం కనిపిస్తోంది.

జనసేనలోకి వెళ్తారా?
అనుచరులతో సమావేశం తర్వాత రాధా ఏ పార్టీవైపు వెళ్తారన్నదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాధా జనసేనలో చేరుతారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు సమావేశం. ప్రస్తుత ఏపీ రాజకీయాలు కాపుల చుట్టే తిరుగుతుండడంతో రాధా జనసేనలోనే చేరుతారని.. ఈ సమావేశంలో తన అనుచరులకు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్ని ఊహాగానాలు మాత్రమే. నిజానికి నాదెండ్ల మనోహర్ రాధాతో భేటి అయినా దగ్గర నుంచి ఆయన జనసేన తీర్థం పుచ్చకొనున్నారనే ప్రచారం మొదలైంది. అటు వంగవీటి రంగ వర్థంతి, జయంతి కార్యక్రమంల్లో జనసేన నేతలతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు రాధా. దీంతో ఈ వాదనలకు మరింత బలం చేకురింది.

బ్యాట్‌ టు వైసీపీ? లేదా టీడీపీ?
మరోవైపు రాధా టీడీపీలోకి వెళ్తారంటూ మరో వర్గం ప్రచారం చేసుకుంటోంది. టీడీపీ యువ నేత నారా లోకేశ్‌ పాదయాత్ర గురించే ఇవాళ తన అనుచరులతో రాధా మీటింగ్‌ పెట్టనున్నారని మరికొందరు చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించనుంది. అయితే కొద్ది కాలంగా టీడీపీలో యాక్టివ్‌గా లేరు రాధ. టీడీపీ తరఫున విజయవాడ సెంట్రల్ సీటు అడిగినట్లు , టీడీపీ అధినాయకత్వం తిరస్కరించినట్టు గతంలో ప్రచారం జరిగింది. బోండా ఉమా ఇప్పటికి అక్కడ నుంచి పోటీ చేయనుండడంతో వేరే నియోజకవర్గం నుంచి పోటికి టీడీపీ ఓకే చెప్పిందని.. సెంట్రల్‌ సీటు కష్టమని చెప్పడంతోనే చంద్రబాబు పార్టీకి దూరమైనట్టు తెలుస్తోంది. గతంలోనూ వైసీపీ నుంచి ఈ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారని.. జగన్‌ అంగీకరించకపోవడంతోనే ఫ్యాన్‌ పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పుకుంటారు. అటు తిరిగి వైసీపీలోకి రాధా చేరతారంటూ కూడా కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. గుడివాడలో జరిగిన కార్యక్రమంలో కొడాలి నాని, రాధా భేటితో ఆ ప్రచారం జోరందుకుంది. ఇలా రాధా విషయంలో ప్రతీది ప్రచారమే కానీ ఓ స్పష్టమైన క్లారిటీ లేదు. ఇవాళ అనుచరులతో సమావేశం తర్వాత రాధా రాజకీయ అడుగులు ఏ పార్టీవైపో తెలిసిపోయే అవకాశం కనిపిస్తుంది.

Advertisment
తాజా కథనాలు