AP: విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. బుడమేరు గండ్లు పూడ్చివేశారు..! విజయవాడలో బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాలకు ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు పడగా.. విజయవాడను వరద ముంచెత్తింది. ఈ గండ్లను పూడ్చివేసేందుకు ఏజెన్సీలతో పాటు చెన్నైకి చెందిన 6వ బెటాలియన్, సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు కృషి చేశారు. By Jyoshna Sappogula 07 Sep 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Vijayawada: విజయవాడలో బుడమేరు గండ్లను అధికారులు పూడ్చివేశారు. భారీ వర్షాల కారణంగా ప్రవాహం పెరిగి బుడమేరు వాగుకు మూడు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయవాడను వరద ముంచెత్తింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు బుడమేరు గండ్లను పూడ్చివేసేందుకు నిరంతరాయంగా శ్రమించారు. ఏజెన్సీల సాయంతో ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చివేసిన అధికారులు.. మూడో గండిని పూడ్చేందుకు ఆర్మీ సాయం తీసుకున్నారు. Also Read: దువ్వాడ వివాదంలో బిగ్ ట్విస్ట్.. ఇంటి దగ్గర మళ్లీ మొదలైన రచ్చ..! మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో గండ్ల పూడ్చివేత పనులు నిరంతరాయంగా సాగాయి. మరో మంత్రి లోకేశ్ కూడా గండ్ల పూడ్చివేత పనులను స్వయంగా పర్యవేక్షించారు. నేడు మధ్యాహ్నానికి మూడో గండిని కూడా పూడ్చేయడంతో దిగువ ప్రాంతాలకు వరద నిలిచిపోయింది. ఒక్కసారిగా 60 వేల క్యూసెక్కుల వరద రావడం వల్లే బుడమేరుకు గండ్లు పడ్డాయని అధికారులు తెలిపారు. ఈ గండ్లను పూడ్చివేసేందుకు ఏజెన్సీలతో పాటు చెన్నైకి చెందిన 6వ బెటాలియన్ అలాగే సికింద్రాబాద్ కు చెందిన రెజిమెంటల్ బెటాలియన్ జవాన్లు కృషి చేశారని అధికారులు వివరించారు. #vijayawada మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి