Vijayawada: బెజవాడలో భగ్గుమన్న పాతకక్షలు.. నడిరోడ్డుపై దారుణ హత్య!

విజయవాడలో దారుణం జరిగింది. క్యాటరింగ్ బాయ్ గా పనిచేస్తున్న ఏసు అనే వ్యక్తిని గణేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా చంపాడు. పాత కక్షల నేపథ్యంలో మటన్ కొట్టే కత్తితో మెడ మీద నరికి హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏసు అక్కడికక్కడే మృతిచెందాడు.

New Update
Vizag: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం

Vijayawada: ఏపీలో దారుణం చోటుచేసుకుంది. విజయవాడలో వన్ టౌన్ రమణయ్య కూల్ డ్రింక్ షాప్ వద్ద నడిరోడ్డుపై ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్యకు గురైయ్యాడు. స్థానికంగా ఈ హత్య కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలంకు చేరుకున్నారు.

Also Read: ఏంది వర్మా.. పవన్‌ను అంత మాట అనేశావ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో మరి..!

క్యాటరింగ్ బాయ్ గా పనిచేస్తున్న ఏసు అనే వ్యక్తిని గణేష్ అనే వ్యక్తి అతి క్రూరంగా హత్య చేశాడు. మటన్ కొట్టే కత్తితో ఏసుని మెడ మీద నరికి విచక్షణ రహితంగా చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఏసు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలంకు చేరుకున్న వన్ టౌన్ సీఐ సురేష్ రెడ్డి నిందితుడు గణేష్ ను అదుపులోకి తీసుకున్నారు. పాత కక్షల నేపథ్యంలోనే గణేష్ హత్య చేసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏసు మృతదేహంను చూసిన బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా, పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని నలుగురు రౌడీ షీటర్ లను నిన్న నగర బహిష్కరణ చేసినట్లు తెలిపారు సీఐ కాశీ విశ్వనాథ్. తుమ్మల విగ్నేశ్వర్, నీలం కార్తీక్, వల్లభనేని ప్రభు దాస్, బాణావతు శ్రీనునాయక్ గతంలో పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించి వచ్చినా వీరి ప్రవర్తనలో ఏ మార్పు రావకపోవటంతో చర్యలు తీసుకన్నట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు