బెడ్డుపై నుంచి డస్ట్ బిన్ లోకి పసికందు.. విజయవాడ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది?

విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక బేబీ డేస్ట్ బిన్ లో పడిపోయిన పట్టించుకోని పరిస్థితి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒకే బెడ్ పైన ఇద్దరు బాలింతలను ఉంచుతున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

బెడ్డుపై నుంచి డస్ట్ బిన్ లోకి పసికందు.. విజయవాడ ఆస్పత్రిలో అసలేం జరుగుతోంది?
New Update

Vijayawada government hospital : విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ లో అతి దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి. పసిపాపకు పాలు పట్టిస్తానని తీసుకెళ్లి డెడ్ బాడీని తీసుకొచ్చిన దారుణమైన ఘటన ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. చనిపోయిన పాప కాలుకు కట్టిన ట్యాగ్ పై అబ్బాయి అని రాసి ఉండటంతో విషయం బయటపడింది. దీంతో తన పసిగుడ్డును అప్పగించాలంటూ తల్లి బోరున విలపిస్తోంది.

Also Read: బేబీ బంప్ తో అనుష్క శర్మ..నెట్టింట్లో వీడియో వైరల్.!

అయితే, ఈ సంఘటనతో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోని దారుణ పరిస్థితులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. డెలివరీకి వచ్చిన వాళ్ళను సిబ్బంది నీచంగా చూస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఇటీవల ఓ మహిళ డెలివరీ కావడంతో ఆ బేబీ డేస్ట్ బిన్ లో పడిపోయినా.. పట్టించుకోని పరిస్థితి. ఆ డస్ట్ బిన్ లో సూదులు ఉంటే ఆ బేబీ పరిస్థితి ఏంటని సిబ్బందిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బెడ్ పైన ఇద్దరు బాలింతలను ఉంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసి పిల్లలతో ఒకే బెడ్ పైన పడుకోవడానికి ఇబ్బంది పడుతున్నమంటూ వాపోతున్నారు. బిడ్డతో సహా కింద పడుకొంటున్నామని చెబుతున్నారు. అయితే, కింద ఎలుకలు విపరీతంగా తిరుగుతున్నాయని.. బిడ్డకు ఏమైన అయితే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు.

Also Read: పాలిటిక్స్, కబడ్డి.. సేమ్ టూ సేమ్..మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!

విజయవాడ ప్రభుత్వ సిబ్బంది పేషంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితులు మండిపడుతున్నారు. పేషంట్స్ ను పట్టించుకోనప్పుడు ఆసుపత్రి ఎందుకు, డాక్టర్లు, నర్సులు ఎందుకు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గవర్నమెంట్..ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి జీతాలు ఎవరికోసం ఇస్తుంది? మాకు సేవ చేయడానికి కాదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రికి వచ్చిన వారిని ఆసుపత్రి సిబ్బంది చాలా దారుణంగా ట్రీట్ చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా స్పందించి తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, పేషంట్స్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా ఆసుపత్రి సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

#andhra-pradesh-government #vijayawada-government-hospital
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe