BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం

ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సీఎం రైల్వే బ్రిడ్జ్ పై ఉన్న ట్రాక్ మీద ఉండగా ఆ సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు.

New Update
BIG BREAKING: చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం

ఏపీ సీఎం చంద్రబాబుకు పెను ప్రమాదం తప్పింది. మధురా నగర్ నుంచి దేవినగర్ ప్రాంతంలో ముంపు ప్రాంతాలను చంద్రబాబు ఈ రోజు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు రైల్వే బ్రిడ్జ్ ట్రాక్ పై ఉన్న సమయంలోనే రైలు వచ్చింది. గమనించిన సీఎం పక్కనే ఉన్న ర్యాంప్ మీదకు వెళ్లారు. ట్రైన్ వెళ్లే వరకు తాకకుండా అక్కడే నిల్చున్నారు చంద్రబాబు. సీఎంతో పాటు అక్కడ ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ రోజు ఉదయం నుంచి బుడమేరు ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటిస్తున్నారు. ఈ ఘటనకు ముందు పలు ప్రాంతాలకు వెళ్లి బుడమేరు వరదను పరిశీలింశారు. సమస్యకు శాశ్విత పరిష్కారం చూపే క్రమంలో చంద్రబాబు ముంపుకు గురైన అన్ని ప్రాంతాలకు వెళ్లి పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే దేవినగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ పైకి ఎక్కి పరిశీలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు