Jagan Stone Attack Case: జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడు సతీష్ కు బెయిల్

ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు సతీష్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శని, ఆది వారాల్లో పోలీస్ స్టేషన్ కు వెళ్లి సంతకం పెట్టాలని కండిషన్ విధించింది. ఇంకా.. విజయవాడ నగరం దాటి వెళ్లొద్దని షరతు విధించింది.

New Update
Jagan Stone Attack Case: జగన్ పై రాయి దాడి కేసు.. నిందితుడు సతీష్ కు బెయిల్

CM Jagan Stone Attack Case - Satish Got Bail: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కి విజయవాడ కోర్టు బెయిలు మంజూరు చేసింది. శని,ఆదివారాల్లో స్థానిక పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలని కోర్టు కండిషన్ పెట్టింది. పోలీసు అనుమతి లేకుండా విజయవాడ నగరం దాటి వెళ్ళకూడదంటూ షరతులు విధించింది. నిందితుడు సతీష్ తరఫున లాయర్ సలీం వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసులు సతీష్ ను అన్యాయంగా ఇరికించారని ఆయన పేర్కొన్నారు. దాడి సతీష్ చేశాడనే ఆధారాలు పోలీసులు వద్ద లేవని వాదనలు వినిపించారు.

ఏప్రిల్ 13న విజయవాడలో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి 8.04 గంటలకు ఆయనపై రాయి దాడి జరిగింది. ఆ రాయి సీఎం ఎడమ కంటిపైన తగలడంతో గాయమైంది. అదే రాయి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి కూడా తగిలింది. ఇదంతా వైసీపీ నేతల డ్రామా అని టీడీపీ నేతలు కౌంటర్లు ఇచ్చారు. అయితే.. వెల్లంపల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు 8 స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి సతీష్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు.

ఈ కేసులో టీడీపీ నేత బోండా ఉమను సైతం అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సైతం సాగింది. దీంతో ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలే జగన్ పై దాడి చేయించారని వైసీపీ నాయకులు ఆరోపించారు.

Also Read: కోదండరాంకు ఆ కీలక బాధ్యతలు.. సోనియాతో భేటీ తర్వాత రేవంత్ ప్రకటన

Advertisment
తాజా కథనాలు