చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్ల పై విచారణను ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది. కస్టడీ పిటిషన్ పై ముందు విచారణ చేయాలని సిఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. బెయిల్ పై ముందు విచారణ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పట్టుపట్టారు. ఇరువైపులా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ ఎంతకూ తెగకపోవడంతో ముందు ఏది వినాలో రేపు నిర్ణయిస్తామని న్యాయమూర్తి తెలిపారు. ఈ మేరకు విచారణను న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. ఇదిలా ఉంటే.. బెయిల్ పిటిషన్ పై తమ వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. అయితే.. పోలీస్ కస్టడీ ఇప్పటికీ పూర్తి అయ్యింది కాబట్టి బెయిల్ పిటిషన్ విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు. ఈ క్రమంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులపై ఎసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: Janasena: జనసేనకు భారీ షాక్.. వైసీపీలోకి కీలక నేత.. ఎవరో తెలుసా?
ఏ పిటిషన్ ఎప్పుడు విచారించాలో తమకు తెలుసని వాఖ్యానించింది. బెయిల్ పిటిషన్ పై విచారించాలని కోర్టుపై ఒత్తిడి చేయొద్దన్న ఎసీబీ కోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్, కస్టడీ పిటిషన్ పై విచారించడానికి కోర్టు సిద్ధంగా ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇరువురి వాదనలు విన్న అనంతరం కోర్టు ఆర్డర్స్ ఇస్తుందని న్యాయమూర్తి తెలిపింది. కస్టడి పిటిషన్ పై సీఐడీ వేసిన మెమోపై కోర్టు నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు తరఫు న్యాయవాది కోరగా.. మెమో ఇంకా తమ దగ్గరకు రాకుండానే నిర్ణయం తీసుకోవాలని కోర్టుకు మీరెలా చెబుతారని ఏసీబీ కోర్టు సీరియస్ అయ్యింది. మీకు ఇలా చేయటం అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై రేపు కోర్టు నిర్ణయం తీసుకోనున్న నేపథ్యంలో టీడీపీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబుకు రేపు కూడా బెయిల్ రాకపోతే ఏం చేయాలన్న అంశంపై నారా లోకేష్ న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు. మరో వైపు ఈ రోజు నారా భువనేశ్వరి, బ్రహ్మణి, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రాజమండ్రి జైలులో చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు.