AP: మీకు దమ్ముంటే ఇలా చేయండి.. టీడీపీ సభ్యులకు విజయసాయి రెడ్డి ఓపెన్ ఛాలెంజ్..!

సోషల్ మీడియాలో టీడీపీ సభ్యులు మారుపేర్లతో వైసీపీ నేతలపై అసభ్య పోస్టులు పెడుతున్నారని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా దుష్ప్రచారాలకు పాల్పడే వారు చచ్చిన వాళ్ల కిందే లెక్క అని మండిపడ్డారు.

New Update
MP Vijaysai Reddy : హోంమంత్రి రాజీనామా చేయాలి.. విజయసాయిరెడ్డి డిమాండ్

Vijayasai Reddy : వైసీపీ (YCP) మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaysai Reddy) టీడీపీ (TDP) సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ సభ్యులు కొందరు సోషల్ మీడియాలో మారుపేర్లతో వైసీపీ నాయకులపై అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. ట్విట్టర్ లో ఆయన స్పందిస్తూ ఇటువంటి ఉన్మాదుల అరాచకాలు బాగా పెరిగిపోతున్నాయని ఫైర్ అయ్యారు.

Also Read: అధికారం పోయినా బలుపు తగ్గలేదు.. సెక్రటేరియట్ ముందు మీ అయ్య విగ్రహం పెట్టుకుంటావా!

ఇతర కులాల పేర్లను తగిలించుకుని.. డబ్బు ఆశతో దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా నేరస్తులు, ఉగ్రవాదులు తమ పేర్లను మార్చుకొని తప్పుడు పేర్లతో చలామణీ అవుతారని.. అలాగే ఇప్పుడు పచ్చ కామెర్లు సోకిన కొందరు వ్యక్తులు కూడా తమ పేర్లను మార్చుకొని.. వారి యజమానులు చెప్పిన వారిపై అదే పనిగా విమర్శలు చేస్తూ ఉన్నారని నిప్పులు చెరిగారు.

Also Read: దువ్వాడ ఆలనా పాలనా నాదే.. మాధురి మరో సంచలన వీడియో!

దమ్ముంటే.. తల్లిదండ్రులు పెట్టిన పేరుతోనే సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయాలన్నారు. పెట్టే ప్రతి కామెంట్స్ కు ధైర్యంగా నిలబడాలని.. అలా లేదంటే సైలెంట్ గా ఉండిపోవాలని హెచ్చరించారు. అంతే తప్ప ఫేక్ అకౌంట్స్ తో ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలను విమర్శిస్తూ పోస్టులు చేయడం కరెక్ట్ కాదన్నారు. అలా చేస్తే వారు చచ్చిపోయిన వాళ్ల కింద లెక్క అని విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు