Vijayasai Reddy: పీకే కామెంట్స్ పై విజ‌య‌సాయిరెడ్డి సీరియస్

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యల వెన‌క దురుద్ధేశం ఉంద‌న్నారు వైసీపీ నేత విజ‌య‌సాయిరెడ్డి. పీకే మాట‌ల్లో విశ్వస‌నీయ‌త లేద‌న్నారు. త‌మ అభివృద్ధే మ‌రోసారి త‌మ‌ను గెలిపిస్తుంద‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు వెల్లడించారు.

New Update
Home Minister Anita : విజయసాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చిన హోంమంత్రి అనిత

YCP Vijayasai Reddy: వచ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి ఓటమితప్పదని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్ర‌శాంత్ కిశోర్ ఇటీవ‌ల‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్ర‌జ‌ల‌కు ఉచితాల పేరిట భారీగా ధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డ‌మే ఓట‌మికి కార‌ణమని పీకే పేర్కొన్నారు. వైసీపీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా మాట్లాడ‌డంతో ఆ పార్టీ మంత్రులు ఏ మాత్రం సహించడం లేదు. ఇప్ప‌టికే పలువురు ముఖ్యనేతలు ప్ర‌శాంత్ కిశోర్ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. పీకే టీడీపీకి బ్రోకర్ గా పనిచేస్తున్నాడని దుమ్మెత్తిపోశారు.

Also Read: రైతులకు జగన్‌ అదిరిపోయే గిఫ్ట్‌.. ఇవాళ అన్నదాతల ఖాతాలలో డబ్బులు జమ!

తాజాగా వైసీపీ సీనియ‌ర్ లీడ‌ర్ విజ‌య‌సాయిరెడ్డి సైతం ప్ర‌శాంత్ కిశోర్ పై ధ్వ‌జ‌మెత్తారు. పీకే మాట‌ల్లో విశ్వ‌స‌నీయ‌త కొర‌వ‌డింద‌ని కామెంట్స్ చేశారు. ఆ మాట‌ల వెన‌క దురుద్ధేశం ఉంద‌న్నారు. ఎవ‌రి హ‌యాంలో అభివృద్ధి జ‌రిగింద‌నేది రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు బాగా తెలుస‌ని పేర్కొన్నారు. ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధే మ‌రోసారి జగన్ ను గెలిపిస్తుంద‌ని చెప్పుకొచ్చారు.

Also Read: ఉదయ్ కిరణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్

ఈ క్రమంలోనే సిద్ధం మ‌హాస‌భ‌ల‌తో వైసీపీ దూసుకుపోతున్న విష‌యాన్ని విజ‌య‌సాయిరెడ్డి గుర్తు చేశారు. మూడు సిద్ధం స‌భ‌ల‌కు చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ప్రజలు హాజ‌ర‌య్యార‌న్నారు. గ‌త ఎన్నిక‌ల్లో సీఏం జ‌గ‌న్ ఇచ్చిన హామీల‌ను 99 శాతం నెర‌వేర్చార‌ని స్ప‌ష్టం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కూడా త‌మ ప్ర‌భుత్వాన్ని గెలిపిస్తే మ‌రింత మెరుగైన ప‌రిపాల‌న అందించేందుకు జ‌గ‌న్ సిద్ధంగా ఉన్నార‌న్నారు. అలాగే సీఏం ఆదేశాల మేర‌కు తాను నెల్లూరు నుంచి పార్ల‌మెంట్ అభ్య‌ర్థిగా పోటీప‌డుతున్న‌ట్లు తెలిపారు. పుట్టి పెరిగిన గ‌డ్డ‌పై పోటీ చేయ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని, గెలిచి ప్ర‌జ‌లకు సేవ చేయ‌డ‌మే త‌న ల‌క్ష్యమని పేర్కొన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు