విజయకాంత్ చనిపోయారనే ప్రచారం.. భార్య రియాక్షన్ ఇదే.! తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ.. విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని..తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు. By Jyoshna Sappogula 30 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Vijayakanth: తమిళ సీనియర్ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ చనిపోయారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత స్పందిస్తూ.. కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని.. తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని.. త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. கேப்டன் நலமாக இருக்கிறார். விரைவில் முழு உடல் நலத்துடன் வீடு திரும்பி, நம் அனைவரையும் சந்திப்பார். - திருமதி. பிரேமலதா விஜயகாந்த் pic.twitter.com/P9iHyO7hzG — Vijayakant (@iVijayakant) November 29, 2023 ప్రస్తుతం విజయకాంత్ చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు పల్మనరీ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. విజయకాంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నామని తెలిపారు. గత 10 రోజులుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నట్టు తెలుస్తోంది. విజయకాంత్ ఆరోగ్యం కుదుట పడిందని.. మరో రెండు రోజుల్లో ఇంటికి చేరుకుంటారని ఆయన అభిమానులు ఆశిస్తున్న సమయంలో హాస్పిటల్ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. విజయకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా లేదని.. ఆయన ఆరోగ్యం క్షీణించిందని హాస్పిటల్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. మరో 14 రోజులపాటు ఆయన హాస్పిటల్‌లోనే ఉండాల్సి వస్తుందని స్పష్టం చేసింది. ‘విజయకాంత్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. అయినప్పటికీ, గడిచిన 24 గంటల్లో ఆయన ఆరోగ్యంలో కాస్త క్షీణత కనిపించింది. ఆయనకి కొంచెం పల్మనరీ చికిత్స అవసరం. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాం. ఆయనకి మరో 14 రోజుల పాటు ఆసుపత్రిలో నిరంతర చికిత్స అవసరం’ అని ప్రకటనలో ఎమ్ఐఓటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ పేర్కొంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి