Vijay Thalapathy: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ వారసుడు

దళపతి విజయ్ ప్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటన, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. దీంతో తమ అభిమాన హీరో వారసుడు ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఎట్టకేలకు నెరవేరింది.

New Update
Vijay Thalapathy: సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ వారసుడు

Vijay Thalapathy Son Jason Sanjay: దళపతి విజయ్ ప్టార్‌డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటన, స్టైల్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు విజయ్ వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమైంది. దీంతో తమ అభిమాన హీరో వారసుడు ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. కానీ హీరోగా మాత్రం రావట్లేదని తెలిసి ఒకింత బాధకు గురవుతున్నారు. అయితేనేం సినిమాల్లోకి వస్తున్నాడని తెలిసి ఓవైపు సంతోష పడుతున్నారు. తన కుమారుడు జాసన్ సంజయ్‌కి సినిమా ఇండస్ట్రీ అంటే ఇష్టమేనని.. కానీ హీరోగా కంటే దర్శకుడు అవ్వాలనే తపన పడుతున్నాడని గతంలోనే విజయ్ స్పష్టం చేశారు. మొత్తానికి సంజయ్ కోరిక నెరవేరే దిశగా తొలి అడుగు పడింది. దర్శకుడు కావాలనే తన గోల్ తీర్చే క్షణం రానే వచ్చింది.

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ద్వారా జాసన్ సంజయ్ దర్శకుడిగా తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. లైకా ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించబోతున్న కొత్త సినిమాకు సంజయ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ మేరకు ఆసంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. సంజయ్ తో కలిసి సినిమా చేయడం ఒక అద్భుతమైన అనుభవం అవుతుందని తెలియజేస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను సంస్థ అధినేత సుభాస్కరన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలో తన తొలి చిత్రం దర్శకత్వం చేయడం సంతోషంగా ఉందని.. అలాగే ఈ సినిమా రూపొందించడంతో తనపై పెద్ద బాధ్యత ఉందని సంజయ్ కూడా ట్వీట్ చేశాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు తెలిపాడు. లండన్‌లోని స్క్రీన్ రైటింగ్‌లో బీఏ(హానర్స్) కంప్లీట్ చేశాడు సంజయ్. అలాగో టొరంటో ఫిల్మ్ స్కూల్లో ఫిల్మ్ ప్రొడక్షన్ డిప్లొమా పూర్తిచేశారు.

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో లియో సినిమా (Leo Movie)  చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. వీరిద్దరి కలయికలో మాస్టర్ వంటి హిట్ తర్వాత తెరకెక్కుతున్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన వారసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నసంగతి తెలిసిందే.

Also Read: అల్లు అర్జున్‌ని కలిసి అభినందించిన గవర్నర్ దత్తాత్రేయ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు