/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/vijay-jpg.webp)
V. Vijaysai Reddy: టీడీపీ వర్గాలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర స్ధాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వైదికపై వరుస ట్వీట్లతో విమర్శలు చేస్తు హేళన చేస్తున్నారు. హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు స్వేచ్ఛకు బేడీలు వేస్తారా? అని పౌర సంఘాలు నిరసన తెలపడం చూశామని, కానీ చంద్రబాబు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఫోటో షూట్ ఐడియా నారా లోకేశ్‌దేనని టీడీపీ వర్గాల బోగట్టా అని చురకలు అంటించారు.
హక్కుల కోసం పోరాడే పేదలను అణిచివేయాలని చూసినప్పుడు ‘స్వేచ్ఛకు బేడీలు’ వేస్తారా అని, పౌర సంఘాలు నిరసన తెలపడం చూశాం. చంద్రబాబు గారు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్టు చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుంది. ఈ ఫోటో షూట్ ఐడియా లోకేశ్…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023
అంతకుముందు కూడా ఓ ట్వీట్ చేశారు. వీళ్లు చేసే సంకెళ్ల ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే సెలెబ్రేషన్స్ ప్రజలకు చంద్రబాబు చేసిన కుంభకోణాల గురించి అవగాహన పెంచుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారని, చంద్రబాబు జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయటపడ్డాయని పేర్కొన్నారు.
వీళ్లు చేసే ‘సంకెళ్ల’ ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే ‘సెలెబ్రేషన్స్’ ప్రజలకు చంద్రబాబు గారు చేసిన స్కాంల గురించి అవగాహన పెంచుతున్నాయి. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారు. బాబు గారి జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయట…
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 17, 2023
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. టీడీపీ నేతల నిరసనలు కొనసాగుతునే ఉన్నాయి. చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ధర్నాలు చేస్తునే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ తీరు పైన మండి పడుతున్నారు. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు. చంద్రబాబును విడుదల చేయలంటు డిమాండ్ చేస్తున్నారు.