Vijayadevarakonda:వంద కుటుంబాలకు కోటి రూపాయలిస్తాను: విజయ్‌ దేవరకొండ!

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijaydevarakonda) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. లైగర్‌ పరాజయం పొందిన తరువాత విజయ్‌ కొంతకాలం పాటు మీడియాకి దూరంగా ఉన్నారు.

Vijayadevarakonda:వంద కుటుంబాలకు కోటి రూపాయలిస్తాను: విజయ్‌ దేవరకొండ!
New Update

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ (Vijaydevarakonda) మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. లైగర్‌ పరాజయం పొందిన తరువాత విజయ్‌ కొంతకాలం పాటు మీడియాకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఖుషి సినిమా విజయం సాధించడంతో ఆ ఆనందాన్ని పంచుకోవడానికి అభిమానుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమా విజయం సాధించడంతో ఆ వేడుకలను ఘనంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసి నిర్వహించారు. ఖుషి (Kushi) చిత్రానికి మంచి ప్రేక్షాకదరణ పొందడంతో చిత్ర బృందం కూడా మంచి ఖుషి మీద ఉంది. దీంతో హీరోతో పాటు అందరూ మంచి సంతోషంలో మునిగి తేలుతున్నారు.

విశాఖలో జరిగిన కార్యక్రమానికి హాజరైన విజయ్‌ అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర ప్రకటన చేశాడు. తన అభిమానుల నుంచి ఓ వంద మందిని సెలెక్ట్‌ చేసుకుని వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున మొత్తంగా కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. బాగా డబ్బు సంపాదించి తను సంతోషంగా ఉంటూ..తల్లిదండ్రులని ఆనందంగా ఉంచాలనుకునేవాడ్ని, సమాజంలో మంచి గౌరవం సంపాదించాలనుకునేవాడ్ని అంటూ తెలియజేశారు. కానీ ఇప్పటినుంచి అభిమానుల కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు.

కొందరు కావాలని ఖుషి సినిమా మీద ఫేక్‌ రివ్యూలను, తప్పుడు ప్రచారాన్ని అధిగమించి మీ అందరి ముందు విజయవంతంగా రన్‌ అవుతుందంటే అది కేవలం అభిమానులు వల్లే అంటూ చెప్పుకొచ్చాడు. డబ్బులిచ్చి మరీ వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నావారు ఇప్పటికైనా తెలుసుకోండి అభిమానుల ప్రేమ ముందు అలాంటివి కొట్టుకుపోతాయని అని వివరించారు,.

ప్రతి అభిమానితో సంతోషం పంచుకోవాలని ఉంది..కానీ అది సాధ్యపడదు. అందుకే వంద కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.1 లక్ష ఇస్తానని విజయ్ ప్రకటన చేశారు. ఈ మొత్తాన్ని వారికి మరో వారం, పది రోజుల్లో అందిస్తానని అన్నారు.

నా ఆనందమే కాదు, నా సంపాదనను కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను అని తెలిపారు. మనమంతా ఇక ఒకే ఫ్యామిలీ అంటూ విజయ్ దేవరకొండ భావోద్వేగానికి లోనయ్యారు.

#viajay-devarakonda #khushi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe