Vigilence on Kaleshwaram: కాళేశ్వరంలో మేఘా దోపిడీ నిజమే.. విజిలెన్స్‌ విచారణలో సంచలన నిజాలు

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్‌ తేల్చింది. దీని కోసం రూ.3200 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 11 పిల్లర్లు డ్యామేజీ అయినట్లు అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది.

New Update
Vigilence on Kaleshwaram: కాళేశ్వరంలో మేఘా దోపిడీ నిజమే.. విజిలెన్స్‌ విచారణలో సంచలన నిజాలు

Vigilence on Kaleshwaram: కాళేశ్వరంలో ప్రాజెక్టులో మేఘా కృష్ణారెడ్డి దోపిడీ నిజమేనని.. వేలకోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ సంచలన నివేదిక సిద్ధం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన కాంట్రాక్టర్లు అందరూ దోషులేనని తేల్చేసింది. కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విజిలెన్స్‌ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధతో పాటు జిల్లాల్లోని శాఖ కార్యాలయాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు లక్ష్మీ పంపుహౌస్‌లను క్షేత్రస్థాయిలో సందర్శించారు విజిలెన్స్‌ డీజీ ఆధ్వర్యంలోని బృందం. వీటన్నింటినీ క్రోడీకరించి నివేదిక సిద్ధం చేశారు అధికారులు.

ఇది కూడా చదవండి: Metro: మెట్రో ఫేజ్‌-2 విస్తరణ రూట్‌మ్యాప్‌ విడుదల

మేడిగడ్డ బ్యారేజీ పనికిరానట్లే..

మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగినట్లు విజిలెన్స్‌ తేల్చింది. దీని కోసం రూ.3200 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేసినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీలో మొత్తం 11 పిల్లర్లు డ్యామేజీ అయినట్లు అధికారులు తేల్చినట్లు తెలుస్తోంది. బ్యారేజీకి మరమ్మతులు చేసినప్పటికీ గ్యారెంటీ లేదని రిపోర్టులో వెల్లడించినట్టు తెలుస్తోంది. వరద ఉద్ధృతిని అంచనా వేయకుండానే మేడిగడ్డ బ్యారేజీని డిజైన్ చేశారని.. ఈ బ్యారేజీ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని గుర్తించినట్లు సమాచారం. మేడిగడ్డ బ్యారేజీ లోకేషన్, డిజైన్, నిర్మాణం, నాణ్యత, నిర్వహణ వరకు అంతా గందరగోళంగానే ఉందని అధికారులు తేల్చినట్టు సమాచారం. అలాగే లక్ష్మీ పంపు హౌసులోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు విజిలెన్స్‌ బృందం నివేదికలో పేర్కొన్నది. ఇటీవల వచ్చిన వరదల్లో పంపు హౌస్‌లో మోటార్లు మొత్తం మునిగిన సంగతి తెలిసిందే. అయితే వీటన్నిటిపై మధ్యంతర నివేదికను వారం రోజుల్లో రేవంత్ సర్కారుకు సమర్పించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు