Hero Venkatesh: వెంకీ మామ కూతురు ఎంగేజ్ మెంట్.!

దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడలో వీరి ఎంగేజ్ మెంట్ వేడుక జరగనుంది. ఇందుకోసం దగ్గుబాటి కుటుంబం ఇప్పటీకే విజయవాడ బయల్దేరిందని తెలుస్తోంది. దగ్గుబాటి కుటుంబమే కాకుండా చాలా తక్కువమంది సెలబ్రటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

New Update
Hero Venkatesh: వెంకీ మామ కూతురు ఎంగేజ్ మెంట్.!

Victory Venkatesh's daughter Hayavahi going to get married: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె హయవాహిని పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. పెద్ద అమ్మాయి ఆశ్రితకు కొన్నేళ్ల క్రితమే వివాహం అయ్యింది. ఇప్పుడు రెండో కూతురు హయవాహిని పెళ్ళికి సిద్ధమైంది. విజయవాడకు చెందిన ఒక పెద్ద డాక్టర్ కుటుంబంతో వెంకీ మామ వియ్యమందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. విజయవాడలో వీరి ఎంగేజ్ మెంట్ వేడుక జరగనుంది. ఇందుకోసం దగ్గుబాటి కుటుంబం ఇప్పటీకే విజయవాడ బయల్దేరిందని తెలుస్తోంది. ఇక ఈ నిశ్చితార్దానికి అక్కినేని కుటుంబం కూడా హాజరుకానుందని సమాచారం. దగ్గుబాటి కుటుంబమే కాకుండా చాలా తక్కువమంది సెలబ్రటీలు ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Also Read: సీఎంగా పవన్..? రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం అన్నారంటే?

ఇక వెంకీమామ.. తన కుటుంబాన్ని ఎప్పుడు సోషల్ మీడియాకు దూరంగానే ఉంచుతూ వస్తున్నాడు. ఇప్పటివరకు వెంకీ భార్య నీరజ ఎవరో చాలా మందికి కూడా తెలియదు. సినిమా, క్రికెట్, కుటుంబం.. ఇవే వెంకటేష్ కు తెల్సినవి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసే రకం కాదు వెంకీ మామ. అంతేకాదు పిల్లలను నటనలోకి తీసుకురావాలని కూడా అనుకోలేదు. వారికి నచ్చిన రంగంలో వారిని ఎదగాలని కోరుకున్నాడు. ఆశ్రిత పెళ్లి తరువాత ఒక ఫుడ్ బ్లాగర్ గా మారింది. హయవాహిని ఒక అథ్లెట్ అని సమాచారం. ఇక వెంకీ మామ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాతో వెంకటేష్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు