బాంబే హైకోర్టులో RTVకి విజయం.. రిపబ్లిక్ టీవీకి ఎదురుదెబ్బ RTVలో R ట్రేడ్ మార్క్ వాడకూడదని బాంబే హైకోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ ఎండీ అర్నాబ్ గోస్వామికి చుక్కెదురైంది. R లోగో వాడినందుకు హైదరాబాద్ మీడియా సంస్థ రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ రూ.100కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, R ట్రేడ్ మార్క్ వినియోగాన్ని నిషేధించాలని అర్నాబ్ గోస్వామి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మనీష్ పితలే RTVకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. By BalaMurali Krishna 01 Sep 2023 in నేషనల్ హైదరాబాద్ New Update షేర్ చేయండి RTVలో R ట్రేడ్ మార్క్ వాడకూడదని బాంబే హైకోర్టును ఆశ్రయించిన రిపబ్లిక్ టీవీ ఎండీ అర్నాబ్ గోస్వామికి చుక్కెదురైంది. R లోగో వాడినందుకు హైదరాబాద్ మీడియా సంస్థ రాయుడు విజన్ మీడియా లిమిటెడ్ రూ.100కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, R ట్రేడ్ మార్క్ వినియోగాన్ని నిషేధించాలని అర్నాబ్ గోస్వామి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ మనీష్ పితలే RTVకి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. న్యూస్ ట్రేడ్ మార్క్ నిబంధనలు RTV ఉల్లంఘించిందని ఆరోపిస్తూ వేసిన వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు R లోగో వినియోగంపై స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చారు. RTV ట్రేడ్ మార్క్ ఉల్లంఘనలకు పాల్పడిందంటూ రిపబ్లిక్ టీవీ మాతృసంస్థ ARG OUTLIER MEDIA మార్చి 23న బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో చివరకు రిప్లబిక్ టీవీకి ఎదురుదెబ్బ తగిలింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి