AP News: ఏపీలో విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. రోడ్ల మీదకు వస్తే ఖతమే.. డీఎస్పీ వార్నింగ్!

ఏపీలో ఎన్నికల ఫలితాల అనంతరం రోడ్లపై సంబరాలు జరుపుకోవడాన్ని పోలీసులు నిషేధించారు. కేక్ కటింగ్, డీజేలతో హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాయకులు, ప్రజలు సహకరించాలని కోరారు.

AP News: ఏపీలో విజయోత్సవ ర్యాలీలు నిషేధం.. రోడ్ల మీదకు వస్తే ఖతమే.. డీఎస్పీ వార్నింగ్!
New Update

Nellore: ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలు మరికొన్ని రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల అల్లర్లు చోటుచేసుకోగా.. రిజల్ట్ రోజు ఎలాంటి ఘర్షణలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎలక్షన్ కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా నాయుడుపేట పట్టణ డీఎస్పీ ఆఫీస్ నందు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ కార్యక్రమాలన్నీ నిషేధం..
ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎలక్షన్ ప్రక్రియ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. అదేవిధంగా రేపు జరగబోయే కౌంటింగ్ రోజు కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలన్నారు. ఎవరైతే గెలుస్తారో వాళ్లకు సంబంధించిన కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి గుంపులు గుంపులుగా చేరడం, కేక్ కటింగ్ చేయడం డీజేలు ఏర్పాటు చేసి సందడి చేయడం ఇలాంటి కార్యక్రమాలు నిషేధించినట్లు వెల్లడించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలియజేశారు. ఈ నియమాలను అతిక్రమించి ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి మీద కేసులు నమోదు చేస్తామని, దయచేసి నాయకులు ప్రజలందరూ సహకరించాలని కోరారు.

అలాగే కౌంటింగ్ రోజు విజయోత్సవం ర్యాలీలు నిషేధం గూడూరు డీఎస్పీ నారాయణరరెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి లో వచ్చే నెల నాలుగో తేదీన కౌంటింగ్ రోజు విజయోత్సవ ర్యాలీలు నిషేధమని చెప్పారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అల్లర్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని గుర్తు చేశారు.

#victory-rallies #banned-in-ap
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe