Deadli Bacteria: అమెరికాను వణికిస్తున్న డెడ్ లీ బ్యాక్టీరియా!

కొత్త వైరస్ పేరు విబ్రియో వల్నిఫికస్‌..ఈ బ్యాక్టీరియా వల్ల రోజురోజుకి ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ బ్యాక్టీరియా వల్ల ఇప్పటి వరకు సుమారు 13 మంది ప్రాణాలు కోల్పోయారని సీడీసీ నిపుణులు వెల్లడించారు

Deadli Bacteria: అమెరికాను వణికిస్తున్న డెడ్ లీ బ్యాక్టీరియా!
New Update

కరోనా..2020 నుంచి ఇప్పటి వరకు ఈ పేరు వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. దీనిలోనే ఒమిక్రాన్‌ అనే సబ్‌ వేరియంట్ కూడా ప్రపంచాన్ని వణికించింది. అయితే కరోనా సమయంలోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దాని భారీ నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అనుకుంటే..కరోనా మహమ్మరి వేరియంట్లు వివిధ రూపాలు సంతరించుకుని ప్రజలను మరోసారి పొట్టన పెట్టుకోవడానికి చూస్తున్నాయి.

దీంతో పలు దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ల వల్ల మళ్లీ ఆసుపత్రుల బాట పడుతున్నారు. దీంతో రోజురోజుకి మరణాల సంఖ్య మళ్లీ పెరుగుతుంది. దీంతో కరోనా మహమ్మారి పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో సరికొత్త బ్యాక్టీరియా పుట్టుకొచ్చింది.

ఈ కొత్త వైరస్ పేరు విబ్రియో వల్నిఫికస్‌..ఈ బ్యాక్టీరియా వల్ల రోజురోజుకి ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ఈ బ్యాక్టీరియా వల్ల ఇప్పటి వరకు సుమారు 13 మంది ప్రాణాలు కోల్పోయారని సీడీసీ నిపుణులు వెల్లడించారు. అయితే ప్రతి ఏడాది కూడా సుమారు 200 మంది అమెరికన్లు ఈ విబ్రియో వల్నిఫికస్ బారిన పడుతున్నారు..కనీసం ఓ పది మంది మరణిస్తున్నారు.

దీనిని ఆరికట్టేందుకు ప్రజలు చొరవ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బ్యాక్టీరియా మానవుల్లో ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. దీనికి ముఖ్య కారణంగా పచ్చి మాంసం, సరిగా ఉడికించని మాంసం తినడం వల్ల చర్మానికి వివిధ రకాల వ్యాధులు సోకుతున్నాయి.

వ్యాధి లక్షణాలు త్వరగా కనిపిస్తాయి. చర్మం పై బొబ్బలు, లో బీపీ, జ్వరం వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఎవరిలోనైనా ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తద్వారా ప్రాణాలను కాపాడవచ్చని పేర్కొన్నారు.

#deadli-bacteria #america #covid
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe