/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Viagra-For-New-Born-jpg.webp)
Viagra for New Born: వైద్యశాస్త్రం.. మనిషికి జీవితం మీద భరోసా ఇస్తుంది. నిత్యం జరుగుతూ ఉండే వైద్య పరిశోధనలు ఎన్నో అద్భుత ఆవిష్కరణలు మనకు అందిస్తూ వస్తున్నాయి. అప్పుడెప్పుడో వచ్చిన ఫ్లూ.. టీబీ.. మశూచి నుంచి నిన్న మొన్నటి కరోనా వరకూ ఎన్నో ప్రాణాంతక వ్యాధులకు పరిష్కారం తీసుకువచ్చి ప్రాణాలను నిలబెట్టాయి వైద్య పరిశోధనలు. ఈ రీసెర్చ్ నిరంతరం సాగుతూనే ఉంటుంది. అంతు చిక్కని.. అంతు పట్టని ఎన్నోరకాల వ్యాధులు.. ఇబ్బందులు అన్నిటికీ పరిష్కారం కనిపెడుతూనే ఉంటారు శాస్త్రవేత్తలు. ఒక్కోసారి ఇలాంటి పరిశోధనల్లో విచిత్రమైన డ్రగ్స్ కూడా బయటపడుతుంటాయి. వాటిని పద్ధతిగా ఉపయోగిస్తే మానవజాతికి ఎంతో మేలు చేస్తాయి. పధ్ధతి తప్పి విచ్చలవిడిగా వాడితే.. సమాజాన్ని కలుషితం చేస్తాయి. అంతేకాదు.. ఒక్కోసారి అలాంటి డ్రగ్స్ వాడకాన్ని నిషేధించడం జరగవచ్చు. కొన్ని డ్రగ్స్ గురించి మన దేశంలో మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఫీలయ్యే విధంగా కూడా పరిస్థితి ఉంటుంది. కానీ, అదే మెడిసిన్ ఇబ్బందుల్లో ఉన్న పసికందులకు ఊపిరి పొసే మందు అని తెలిస్తే.. అన్ని పరిస్థితులకు.. విషయాలకు బొమ్మా బొరుసూ ఉన్నట్లే ఈ మెడిసిన్ (Viagra for New Born)కి కూడా చీకటి కోణం-ఆశావహ వెలుతురు ఉన్నాయి. ఆ మెడిసిన్ వయాగ్రా!
Also Read: పేటీఎం ఫాస్టాగ్ డీయాక్టివేట్ చేసుకోవడం ఎలా?
అవును వయాగ్రా పేరు చెబితే మనకి ముందుగా గుర్తొచ్చేది విచ్చలవిడి శృంగారం కోసం మదమెక్కిన వారు వాడే మందుగా అనిపిస్తుంది. మన సమాజంలో నేరుగా వయాగ్రా(Viagra for New Born) పేరు కూడా చెప్పడానికి చాలా మంది ఇష్టపడరు. కానీ, ఇది నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన చిన్నారుల పాలిట ప్రాణదాత కాగలదంటే నమ్మగలరా? నమ్మాల్సిందే. ఎందుకంటే, కొన్ని రీసెర్చ్ ఫలితాలను ఉటంకిస్తూ ది సన్ అనే బ్రిటన్ వెబ్సైట్ లో దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. వాటి ప్రకారం గర్భధారణ సమయంలో ఆక్సిజన్ అందని.. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే శిశువులకు సహాయపడటానికి సిల్డెనాఫిల్ - లేదా చిన్న నీలం మాత్ర - సాధ్యమైన పరిష్కారం అని పేర్కొంది. నవజాత శిశువుల్లో కనిపించే ఈ పరిస్థితిని నియోనాటల్ ఎన్సెఫలోపతి అని అంటారు. దీనికి చాలాకాలంగా పరిష్కారం కోసం వెతుకుతూనే ఉన్నారు పరిశోధకులు. తాజాగా మాంట్రియల్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చేసిన క్లినికల్ అధ్యయనం మొదటి దశ ఒక పరిష్కారాన్ని సూచింది. ఇది వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయాన్ని ఇటీవలి ది జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్‌లో కూడా ప్రచురించారు. దాని ప్రకారం ఆ మందు వయాగ్రా. వయాగ్రా(Viagra for New Born) వాడకం నియోనాటల్ ఎన్సెఫలోపతి వల్ల మెదడు దెబ్బతినే సంకేతాలను సరిచేయడానికి సహాయపడుతుంది. ఈ అద్భుతమైన ఫలితం ఎందరో చిన్నారుల పాలిట వరంగా మారే అవకాశం ఉంది. ఆక్సిజన్ కొరతతో పోరాడుతున్న శిశువులకు ఇది ఉపయోగకరమైన పరిశోధన అని చెప్పవచ్చు.
ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సీనియర్ డాక్టర్ పియా వింటర్ మార్క్ సిల్డెనాఫినాల్ చాలా చౌక అయిన మందు అని.. దీనిని వాడటం కూడా చాలా ఈజీ అని చెప్పారు. ఇప్పుడు జరుపుతున్న ఈ అధ్యయనం పాజిటివ్ గా ఉంది. తరువాత జరిపే అధ్యయనాలు కూడా ఇదేరకమైన ఫలితాలను ఇస్తే కనుక అది ప్రపంచవ్యాప్తంగా నియోనాటల్ ఎన్సెఫలోపతితో బాధపడుతున్న శిశువుల జీవితాలను మార్చగలదు అంటున్నారు.
Watch this Interesting Video: