Lamp Tips : ఇంట్లో దీపం పెడుతున్నారా? కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే!

హిందువుల్లో అనేక మంది ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. బంగారం, వెండి, లేదంటే మట్టి కుందుల్లో దీపం పెట్టొచ్చు. దీపారాధనకు ఆవు నెయ్యి, నువ్వుల, కొబ్బరి నూనె వాడొచ్చుజ. ఇలా దీపారాధన చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

New Update
Lamp Tips : ఇంట్లో దీపం పెడుతున్నారా? కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే!

Puja Lamp : హిందూ సాంప్రదాయం (Hindu Tradition) లో దీపారాధనకు ప్రత్యేక గుర్తింపు ఉన్నది. హిందువులు ప్రతి ఒక్కరు కచ్చితంగా ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు. ఈ దీపారాధన చేసేటప్పుడు కొంతమంది కొన్ని నియమాలు పాటిస్తారు. మరి కొంతమంది ఏమి పాటించరు. కొందరికి దీపం ఎలా పెట్టాలో కూడా తెలియదు. అలాంటి వారు కొంచెం ఆందోళన పడుతూ ఉంటారు. రోజు ఇంట్లో దీపం ఎలా పెట్టాలో.. పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో.. దీపం పెట్టడానికి ఎలాంటి నియమాలు పాటించాలో ఈ ఆర్టికల్‌లో ద్వారా తెలుసుకొందాం.

publive-image

ఇంట్లో రోజు దీపం పెట్టేటప్పుడు కచ్చితంగా కొన్ని నియమాలుపాటించాలట. దీపారాధన (Lamp Worship) చేయడానికి ప్రతిరోజు తల స్నానం చేయనక్కర్లేదు. మామూలు స్నానం చేస్తే చాలు. ఎప్పుడూ కూడా ఇనుప ప్రమిదలో దీపం పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండి, లేదంటే మట్టి వాటిలోనైనా దీపం పెట్టొచ్చు. దీపపు ప్రమిదనే ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు. అప్పుడు దీపాన్ని అగవరపరిచినట్లు అవుతుంది. దీపారాధనకి ఆవు నెయ్యిని ఉపయోగిస్తే మంచిది. లేదంటే నువ్వుల నూనె కూడా వాడొచ్చు. కొబ్బరి నూనెతో అయినా దీపం పెట్టొచ్చు. రెండు పుట్ల దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. దుష్టశక్తులు పోతాయి. నిత్యం దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి. ఇంట్లో శాంతి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Also Read : దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్‌ రోడ్డు… పరిశీలించిన మంత్రి!

Advertisment
Advertisment
తాజా కథనాలు