Venu Yeldandi: గుడ్ న్యూస్ చెప్పిన వేణు.. ఫొటోలు వైరల్..!

అభిమానులతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు 'బలగం' డైరెక్టర్ వేణు.. మాకు ఆడబిడ్డ జన్మించింది ఈ విషయాన్నీ నా అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ వేణు సోషల్ మీడియాలో తన కూతురితో ఉన్న ఫోటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వేణుకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు కామెంట్స్ చేస్తున్నారు.

New Update
Venu Yeldandi: గుడ్ న్యూస్ చెప్పిన వేణు.. ఫొటోలు వైరల్..!

Venu Yeldandi: జబర్దస్త్ వేణుగా అందరికి పరిచయమైన వేణు ఇప్పుడు 'బలగం'(Balagam) డైరెక్టర్ గుర్తింపు తెచ్చుకున్నాడు. 'బలగం' సినిమాతో ఇండస్ట్రీ లో పెద్ద పెద్ద స్టార్ హీరోల నుంచి ప్రశంశలు అందుకున్నారు వేణు. చిన్న సినిమాగా విడుదలైన 'బలగం' భారీ విజయాన్ని అందుకొని చాలా అవార్డులు, రివార్డులు సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాత జబర్దస్త్ వేణు, 'బలగం' డైరెక్టర్ వేణుగా మారాడు. ఈ సినిమా వేణు కెరియర్ కు మంచి బ్రేక్ ఇవ్వడంతో పాటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిందనే చెప్పవచ్చు. అయితే తాజాగా ఈ డైరెక్టర్ తమ అభిమానులతో ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు.. వేణు రెండో సారి తండ్రి అయ్యాడు.. తమకు ఆడబిడ్డ పుట్టిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్నీ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు.

మాకు ఆడబిడ్డ జన్మించింది ఈ విషయాన్నీ నా అభిమానులతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది అంటూ వేణు సోషల్ మీడియాలో తన కూతురితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వేణుకు శుభాకాంక్షలు తెలుపుతూ పలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక బలగం సినిమా తర్వాత వేణు ఓ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపించాయి కానీ ఆ వార్తలో నిజం లేదని తెలుస్తోంది.

Also Read: Sukumar: సుకుమార్.. మరీ ఇంత రాక్షసుడా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు