AP : ఏపీలో మరో 2.32 లక్షల ఇళ్లు నిర్మించేందుకు కేంద్రానికి ప్రతిపాదన! వెంకటరమణారెడ్డి సోమవారం విజయవాడలోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కొత్తగా 2.32 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెంకటరమణారెడ్డి తెలిపారు. By Bhavana 06 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి State Housing Corporation : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్(Andhra Pradesh State Housing Corporation) మేనేజింగ్ డైరెక్టర్ గా వెంకటరమణా రెడ్డి(Venkata Ramana Reddy) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఏపీలో ఇటీవల ఐఏఎస్(IAS) ల బదిలీలు జరిగాయి. ఈ క్రమంలో తిరుపతి కలెక్టర్ గా ఉన్న వెంకటరమణారెడ్డిని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగానూ, ఇప్పటి వరకు ఈ స్థానంలో బాధ్యతలు నిర్వహిస్తున్న లక్ష్మీషాను తిరుపతి కలెక్టర్ గా బదిలీ చేశారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే లక్ష్మీషా హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టు నుంచి రిలీవై తిరుపతి(Tirupati) చేరుకుని అక్కడ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో హౌసింగ్ ఎండీ బాధ్యతలు స్వీకరించడానికి మొదటి వెంకటరమణారెడ్డి సుముఖత చూపలేదు. దీంతో ఆయన స్థానంలో హౌసింగ్ కార్పొరేషన్ జేఎండీ చేస్తున్న ఐఏఎస్ అధికారి శివప్రసాద్ ను ఇన్‌ఛార్జీ ఎండీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా వెంకటరమణారెడ్డి సోమవారం విజయవాడ(Vijayawada) లోని హౌసింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన సంస్థ సీనియర్ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా 2.32 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వెంకటరమణారెడ్డి తెలిపారు. ఇప్పటికే మెగా కంప్లీషన్ డ్రైవ్ లో భాగంగా రాష్ట్రంలో సుమారు 2.25 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినట్లు ఆయన వివరించారు. త్వరలోనే మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని చెప్పారు. లబ్దిదారులకు వచ్చే రుణాలను వెంటనే మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. Also Read : పిల్లల ఎత్తు, బరువు పెరగడం లేదా..అయితే ఈ లోపమే కావొచ్చు! #housing-corporation-managing-director #venkata-ramana-reddy #andhra-pradesh-state-housing-corporation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి