Ten Rupees Coin: ఆర్బీఐ చెప్పినా వినరా? పదిరూపాయలు నాణేల విషయంలో వ్యాపారుల అతి!

పది రూపాయల నాణేలు చెల్లవని వ్యాపారులు చెబుతూ వస్తున్నారు. పది రూపాయల కాయిన్స్ విషయంలో ఆర్బీఐ ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పది రూపాయల నాణేలు చెల్లుబాటులో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది.

New Update
Ten Rupees Coin: ఆర్బీఐ చెప్పినా వినరా? పదిరూపాయలు నాణేల విషయంలో వ్యాపారుల అతి!

Ten Rupees Coin: పదిరూపాయలు నాణేలను తీసుకోవడానికి చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకూ అందరూ తిరస్కరిస్తున్నారు. ఒకపక్క ఆర్బీఐ (RBI) పదిరూపాయాల నాణేలు చెల్లుతాయని ఎంత చెప్పినా వ్యాపారులు పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ లో ఇటీవల ఒక గృహణి తన దగ్గర ఉన్న 10 రూపాయల నాణేన్ని ఒక ఆటో డ్రైవర్ కు ఇచ్చింది. కానీ, ఆ ఆటో డ్రైవర్ నాణేలను తీసుకోవడానికి నిరాకరించాడు. అంతేకాకుండా కచ్చితంగా ఇవి చెల్లవు అంటూ చెప్పాడు. దీంతో ఆ గృహణి ఎందుకు తీసుకోరని ప్రశ్నించగా.. చాలా కాలం క్రితమే తమ ఆటోడ్రైవర్ యూనియన్ పదిరూపాయలు నాణేలు చెల్లవని చెప్పిందనీ.. అందుకే తీసుకోననీ ఖరాకండిగా చెప్పేశాడు. ఒక పక్క బ్యాంకులు పది రూపాయల నాణేలు చెల్లుతాయని ఎంత చెప్పినా వాటిని తీసుకోవడానికి అందరూ నిరాకరిస్తున్నారు. 

అయితే, ఆర్బీఐ మాత్రం ఈ నాణేలు (Ten Rupees Coin) చెల్లుతాయని స్పష్టం చేస్తోంది. నిజానికి ఆర్బీఐ 2005లో ఈ పదిరూపాయలు నాణేలను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అవి చెలామణీలో ఉన్నాయి. ఈ క్రమంలో 2016లో పదిరూపాయల నాణేలు చెల్లవంటూ వదంతులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది. 2011లో తయారైన పది రూపాయల నాణేలలో రూపీ సింబల్ లేకపోవడంతో ప్రజల్లో ఇలాంటి వదంతులు వ్యాప్తి చెందాయని. రూపాయి సింబల్ ఉన్నా, లేకపోయినా.. పది రూపాయాల నాణేలు చెల్లుతాయనీ ప్రకటించింది. అప్పుడు కొంతవరకూ నాణేలు మార్కెట్లో చెలామణీ అయ్యాయి. కానీ 2019 నుంచి పది రూపాయల నాణేలను తీసుకోవడానికి వ్యాపారాలు ఎవరూ ఇష్టపడటం లేదు. అప్పుడు కూడా ఆర్బీఐ క్లారిటీ ఇచ్చింది పదిరూపాయలు నాణేలు చెల్లుతాయంటూ స్పష్టం చేస్తూ ప్రకటన చేసింది. అయినప్పటికీ ఇప్పటికీ పదిరూపాయలు నాణేలు చెల్లవంటూ వ్యాపారులు ప్రజల నుంచి నాణేలను తీసుకోవడానికి నిరాకరిస్తూ వస్తున్నారు. 

Also Read: వారేవా! గంటకు కోటిన్నర.. ప్రభుత్వానికి ఆ కంపెనీ నుంచి డబ్బే డబ్బు!

ప్రస్తుతం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆర్బీఐ.. బ్యాంకులు పది రూపాయల నాణేలు చెల్లుబాటు అవుతాయని చెప్పినా ప్రజల వద్ద నుంచి నాణేలను తీసుకోవడానికి వ్యాపారులు నిరాకరిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు