Vehicle Sales: పండగల సీజన్ లో కార్ల అమ్మకాలు బాగా పెరిగాయి. అదేసమయంలో టూవీలర్స్ అమ్మకాలు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. టూవీలర్స్ అమ్మకాలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా పెరిగాయి. మరోవైపు ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రం పూర్తిగా పడిపోయాయి. దసరా నవరాత్రుల సమయంలో తక్కువగా నమోదు అయిన టూ వీలర్ విక్రయాలు ఈ దీపావళి పండుగ సీజన్ లో పుంజుకున్నాయి. మొత్తంగా చూసుకుంటే ప్యాసింజర్ వాహనాల విక్రయాలు బాగా పెరిగాయి.
ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) వాహనాల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. దీనిప్రకారం ఈ ఏడాది పండుగల సీజన్‌లో భారత మార్కెట్‌లో వాహనాల విక్రయాలు భారీగా పెరిగాయి. నవరాత్రి మొదటి రోజు నుంచి ధన్‌తేరస్ తర్వాత 15 రోజుల వరకు కొనసాగిన 42 రోజుల పండుగ సీజన్‌లో, దేశంలో మొత్తం 37.93 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి.
Also Read: అమ్మో.. ఒకటో తారీఖు.. కొత్త నిబంధనలు ఇవే.. తెలుసుకోకపోతే నష్టపోతారు
2022తో పోలిస్తే ఇది 18.73% పెరిగింది. గతేడాది సెప్టెంబరు 26 నుంచి నవంబర్ 6 వరకు పండుగల సీజన్‌లో 31.95 లక్షల వాహనాలు(Vehicle Sales) అమ్ముడయ్యాయి. 5 లక్షలకు పైగా ప్యాసింజర్ వాహనాలు విక్రయించారు. ఈ నివేదిక ప్రకారం, ఈ కాలంలో 28.93 లక్షల ద్విచక్ర వాహనాలు, 1.43 లక్షల త్రిచక్ర వాహనాలు, 1.24 లక్షల వాణిజ్య వాహనాలు, 5 లక్షలకు పైగా ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. ట్రాక్టర్ విక్రయాల్లో 0.5% క్షీణత నమోదైంది.
గ్రామీణ ప్రాంతాల్లో..
గ్రామీణ ప్రాంతాల్లో టూ వీలర్స్ విక్రయాలు పెరిగాయి. నవరాత్రి సమయంలో క్షీణతతో ప్రారంభమైన తర్వాత, దీపావళి ముగిసే సమయానికి 10% వృద్ధిని సాధించింది. నవరాత్రుల ప్రారంభంలో, ట్రాక్టర్ విక్రయాలలో 8.3% క్షీణత ఉంది, కానీ దీపావళి ముగిసే సమయానికి అది కోలుకుంది మరియు 0.5% ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది.
Watch this interesting Video: