Vegetable Rates : కొత్తిమీర రూ.260.. పాలకూర రూ.120... ఇక తిన్నట్లే!

జూన్ నెల ఒకటో తేదీ తర్వాత నుంచి కూరగాయల ధరలు రాకెట్ లా దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏది ముట్టుకున్న వంద రూపాయలు అన్నట్లు ఉంది. దీంతో జనాలు కూరగాయలు కొనాలంటేనే హడలిపోతున్నారు.ఎంతలా అంటే కొత్తిమీర కేజీ కట్ట ఏకంగా రూ. 260 గా ఉంది.

Vegetable Rates :  కొత్తిమీర రూ.260.. పాలకూర రూ.120... ఇక తిన్నట్లే!
New Update

Vegetable Rates Hiked :  కూరల్లో కరివేపాకు, కొత్తిమీర అంటే ఎంతో తేలికగా తీసిపడేస్తారు చాలా మంది. కానీ ఇప్పుడు ఆ పని చేయాలంటే వందల రూపాయలను తీసి చెత్తలో పడేయడమే. ఎందుకంటే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. అది కూడా ఏ రేంజ్‌ లో అంటే పాలకూర కేజీ రూ. 120, అదే కొత్తిమీర కేజీ కట్ట ఏకంగా రూ. 260 మరి. వీటి ధరలు ఇలా ఉంటే..పచ్చిమిర్చి కేజీ 180 రూపాయలు. ఎందుకంటే మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోయాయి.

ఎంతలా అంటే.. కేవలం 17 రోజుల్లోనే.. అంటే జూన్ నెల ఒకటో తేదీ తర్వాత నుంచి కూరగాయల ధరలు (Vegetable Rates) రాకెట్ లా దూసుకుపోతున్నాయి. కూరగాయ ఏది ముట్టుకున్న వంద రూపాయలు అన్నట్లు ఉంది. దీంతో జనాలు కూరగాయలు కొనాలంటేనే హడలిపోతున్నారు. ధరల పెరుగుదలకు అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. కొంత కాలం క్రితం వరకు ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో వానలు బీభత్సం సృష్టించాయి.

దీంతో పంటల ఎదుగుదల ఆలస్యమై, దిగుబడి తగ్గింది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్లకు కూరగాయల రవాణా భారీగా నిలిచిపోయింది. మహారాష్ట్ర (Maharashtra) నుంచి వచ్చే టమాట రావడం లేదు. దీంతో వాటి ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కేజీ టమాట 80 రూపాయల పైనే పలుకుతోంది.

మరోవైపు మార్కెట్లకు ఆకుకూరలు రావడం లేదు. ప్రస్తుతం పాలకూర కేజీ 120 రూపాయలకు చేరింది. బీరకాయ, వంకాయ లాంటి కూరగాయలు కిలో వంద దాటాయి. క్యారెట్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, వంకాయ ఇలా వేటి ధరలైనా సరే ముట్టకుంటేనే మండుతున్నాయి. కిలో బీట్ రూట్ 80 కి పైగా ఉంది. పచ్చిమిర్చి ఏకంగా 180 కేజీ ధర పలుకుతోంది.

ఇక... కొత్తిమీర, పుదీన కేజీ 260 రూపాయల ధర పలుకుతోంది. వీటితో పాటు ఇతర కూరగాయలు దాదాపు కేజీ 80 పైనే పలుకుతున్నాయి. పెరిగిన ధరలు చూసి పచ్చడి మెతుకులే దిక్కంటున్నారు పబ్లిక్. కూరగాయల ధరలు భారీగా పెరగటంపై సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఉల్లి ధరలు (Onions Price) కూడా విపరీతంగా పెరుగుతుండడంతో సామాన్య ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

Also read: నేడు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!

#spinach #leafy-curries #vegetable-rates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe