Cholesterol Friendly Veggies: అధిక కొలెస్ట్రాల్ కు.. ఈ కూరగాయలతో చెక్ పెట్టండి

శరీరంలో అధిక కొలెస్ట్రాల్ తో బాధపడేవారు ఈ కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. స్పినాచ్, క్యారెట్, బీట్ రూట్, బ్రోకలీ, క్యాబేజీ, బెండకాయ. వీటిలోని హై ఫైబర్, యాంటీ ఆక్షిడెంట్స్ , విటమిన్స్, మినరల్స్ కొవ్వును తగ్గించి.. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.

New Update
Cholesterol Friendly Veggies: అధిక కొలెస్ట్రాల్ కు.. ఈ కూరగాయలతో చెక్ పెట్టండి

Cholesterol Friendly Veggies: ఈ మధ్య కాలం చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, వంటి జీవన శైలి వ్యాధులతో బాధపడుతున్నారు. అనారోగ్యపు అలవాట్లు, జీవన శైలి విధానాలు వీటి పై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కావున శరీరంలో కొవ్వును తగ్గించడానికి డైలీ డైట్ లో ఈ కూరగాయలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము.

బ్రోకలీ

కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు డైలీ డైట్ లో బ్రోకలీ తీసుకోవడం ఉత్తమం. వీటిలోని హై ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, శరీరంలోని కొవ్వును తగ్గించి.. గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బీట్ రూట్

బీట్ రూట్ లో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కొన్ని నివేదికల ప్రకారం బీట్ రూట్ జ్యూస్ తాగడం రక్తపోటును తగ్గించి.. గుండె పోటు ప్రమాదం నుంచి రక్షిస్తుంది. అంతే కాదు ఇవి ఆక్షిజన్ స్థాయిలను పెంచి.. నీరసం లేకుండా రోజంతా యాక్టీవ్ గా ఉంచుతుంది.

publive-image

బ్రుస్సేల్ స్ప్రౌట్స్

వీటిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

క్యారెట్

క్యారెట్ లోని బీటా కెరోటీన్, పొటాషియం, మినరల్స్ అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది.

పాలకూర

పాలకూర గుండె, కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలోని లూటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.

క్యాబేజీ

ఈ కూరగాయలోని sulphoraphane, Indole -3, వంటి పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. డైలీ డైట్ లో దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బెండకాయ

బెండకాయలోని సోలబుల్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో మంచి కొవ్వులు పెరుగుదలకు సహాయపడుతుంది. అలాగే ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Also Read: Rose Day: లవర్స్ కి ప్రపోజ్ టైం లో గులాబీ పువ్వునే ఎందుకు ఇస్తారు?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు