Vegetable Salad: అధిక బరువుకు చెక్ పెట్టేందుకు ఈ వెజిటేబుల్ సలాడ్‌ బెస్ట్!

ఈ రోజుల్లో చాలామంది ఊబకాయం, అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో అనేక వ్యాధుల బారినపడుతున్నారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి వెజిటేబుల్ సలాడ్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
Vegetable Salad: అధిక బరువుకు చెక్ పెట్టేందుకు ఈ వెజిటేబుల్ సలాడ్‌ బెస్ట్!

Vegetable Salad: వెజిటేబుల్ సలాడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలజడిగా ఉన్న పొట్టలో ప్రశాంతత తీసుకురావడంతో పాటు శరీరానికి ఈ సలాడ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని ఏ సీజన్లోనైనా తినొచ్చు. దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు గ్యాస్‌ సమస్య ఉన్నవారు దీనిని తింటే వెంటనే ఫలితం ఉంటుంది. దీనిని ఎలాంటి నూనె, ఉప్పు, ఇతర రసాయనాలు లేవు కావున ఇది ఆరోగ్యానికి ఎంతో మంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ ఫుడ్‌ బెస్ట్‌ అని అంటున్నారు. దీని తయారీ గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్‌లో కొన్ని విషయాలు తెలుసుకుందాం.

వెజిటేబుల్ సలాడ్‌కు కావలసిన పదార్థాలు:

  • కీరదోసకాయ ముక్కలు- ఒక కప్పు
  • క్యారెట్ ముక్కలు- ఒక కప్పు
  • సొరకాయ ముక్కలు- ఒక కప్పు
  • టమాటా ముక్కలు- ఒక కప్పు
  • సన్నగా కట్ చేసి కొత్తిమీర కొద్దిగా
  • దానిమ్మ గింజలు- ఒక కప్పు
  • నిమ్మరసం

publive-image

తయారీ విధానం:

  • ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్ అన్నిటిని ఒక గిన్నెలో సొరకాయ, కీరదోసకాయ, క్యారెట్, టమోటా ముక్కలు, కొత్తిమీర, దానిమ్మ గింజలు, ఇవన్నీటిని వేసి మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చివరిలో నిమ్మరసం పిండాలి. ఇవన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకుంటే వెజిటేబుల్ సలాడ్ సిద్ధంగా ఉంటుంది. డైజీషన్, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉన్నవారికి ఈ సలాడ్ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. దీనిని తింటే కమ్మగా అనిపిస్తుంది. సులువుగా డైజీషన్ అవుతుంది.  దీనిని ఎలాంటి సమస్య లేకుండా హాయిగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా!

Advertisment
తాజా కథనాలు