Vastu Tips: మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందా..? లక్ష్మీ కటాక్షం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీ ఇంట్లో చేయాల్సిన పని ఒక్కటి ఉంది. ఈ టిప్పు ఫాలో అయితే ఇంట్లో దరిద్ర దేవత బయటికి వెళ్లిపోయి లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆర్థిక కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తూనే ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాంటి వాటిలో దరిద్ర దేవత సమస్య ఒకటి. ఇంట్లో దరిద్ర దేవత ఉంటే ఎవరికైనా డబ్బు నిలవదు. అంతేకాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యలను పోగొట్టాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
ఇంట్లో దూపం వేసే విధానం:
ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి పంపించాలంటే నెలలో ఒక్కసారైనా శుక్రవారం, మంగళవారం ఒక ప్రత్యేకమైన దూపం ఇంట్లో వేయాలి. ధూపం అంటే గుగ్గిలం పొడి, సాంబ్రాణి, ఆవు నెయ్యి, ఎండుకొబ్బరి పొడి, పంచదార ఈ ఐదు కలిపి ఇల్లంతా ధూపం వేయాలి. ఈ రెమిడీని నెలకొకసారి చేస్తే ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, శుక్రవారం మాత్రమే ఈ ఐదిటిని మండించి ధూపం లాగా వేసి ఇంట్లో అన్ని దిక్కుల ఈ పొగను వ్యాపించేలా చూడాలి. ఇలా చేస్తే ఇంట్లో దరిద్ర దేవత ఏ మూల ఉన్నా సరే బయటకు వెళ్లిపోతుంది. అప్పుడు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.
ఇది కూడా చదవండి: పుషప్స్ చేస్తే గుండెపోటు రాదా? నిజమేంటి?