Vasthu tips: పావురం మీ ఇంట్లో ఈ దిక్కున గూడు పెట్టిందా..అయితే మీరు!

సాధారణంగా మన ఇళ్లలో పక్షులు గూళ్లు కట్టుకుంటు ఉంటాయి. అయితే ఇలా పక్షులు గూళ్లు కట్టుకోవడం గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే. పక్షులు కొన్ని దిక్కుల్లో గూళ్లు కట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు.

New Update
Vasthu tips: పావురం మీ ఇంట్లో ఈ దిక్కున గూడు పెట్టిందా..అయితే మీరు!

సాధారణంగా మన ఇళ్లలో పక్షులు గూళ్లు కట్టుకుంటు ఉంటాయి. అయితే ఇలా పక్షులు గూళ్లు కట్టుకోవడం గురించి వాస్తు శాస్త్రం ఏం చెబుతుందంటే. పక్షులు కొన్ని దిక్కుల్లో గూళ్లు కట్టుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా మనం ఇళ్లలో పావురాళ్లు, పిచ్చుకలు, పొలం పిచ్చుకలు గూడు కట్టుకోవడం చూస్తుంటాం.

ఇలా పక్షులు ఇంటిలో ఏ దిక్కున తమ ఇంటిని కట్టుకుంటే మంచిది అంటే..వాస్తు శాస్త్రం ప్రకారం..ఇంటి బాల్కనీలో కానీ, కిటికీలో కానీ పిచ్చుకలు చిన్న చిన్న గూడులు కట్టుకుని ఉంటే అది శుభ సూచకంగా చెబుతున్నారు. ఇంటిలో లక్ష్మీ దేవి కొలువై ఉండటానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Also read: మహిళలకు గుడ్ న్యూస్…మరింత తగ్గిన బంగారం ధరలు..కొనేందుకు మంచి ఛాన్స్..!!

అంతేకాకుండా ఆకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటికి తూర్పు వైపున పిచ్చుక కనుక గూడు నిర్మించుకుంటే..అది ఆనందానికి, శ్రేయస్సుకి సంకేతాలని తెలుస్తుంది. అలాగే ఆగ్నేయంలో పిచ్చుక గూడు కానీ కడితే..ఆ ఇంట్లో త్వరలోనే వివాహాది కార్యక్రమాలు జరుగుతాయని సంకేతం.

నైరుతి దిశలో కానీ పిచ్చుకలు గూడు కట్టుకుంటే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ఎక్కువ ధనం చేతికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా పంటలు కూడా బాగా పండుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే పావురం ఇంటి బాల్కనీలో కానీ కిటికీలో కానీ గూడు కడితే అది దురదృష్టానికి సంకేతంగా పరిగణించడం జరుగుతుంది.

ఇవన్నీ ఇలా ఉంటే తేనెటీగలు ఇంట్లో గూడు కట్టిన కూడా ఇంటికి మంచిది కాదు. దీని వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి లోపలకి , పరిసరాల్లోకి కానీ గబ్బిలాలు వచ్చిన కూడా అది చెడుకి సంకేతంగా భావించాలి. త్వరలోనే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు