Vastu Tips Telugu: చాలామందికి జీవితంలో డబ్బులు లేక ఇబ్బంది పడతారు. కొంతమంది ఎంత కష్టపడినా డబ్బులు మాత్రం నెల చివరకు మిగలవు. ఆఫీస్‌లో ఎంత జీతం వచ్చినా అది సరిపోక చాలామంది అప్పులు చేస్తారు. ఆ అప్పులు తీర్చేలోపే జీవితం గడిచిపోతుంది. ఇక హ్యాపీగా ఉండేది ఎప్పుడు? అందుకే వాస్తు నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. అవి ప్రయత్నిస్తే డబ్బు సమస్య తీరుపోతుందట! దీనిని కొన్ని విషయాలు ఈ ఆర్టికల్ లో చూద్దాం.
డబ్బులు కోసం వాస్తు చిట్కాలు:
- తెల్లటి పిగ్గీ బ్యాంకును ఉత్తరం వైపుగా ఉంచండి. కొంతమంది డబ్బులు పొదుపు చేయడానికి కుండలను వాడుతారు. డబ్బులు పొదుపు చేసుకునే ఈ వస్తువు అయినా సరే దాన్ని ఉత్తరం వైపునే ఉంచాలి.
- మీ ఇంటికి ఆగ్నేయ దిశ రాగి పాత్రను ఉంచండి. దీని వల్ల ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు.
- ఉత్తరం, పశ్చిమం లేదా ఆగ్నేయంలో డస్ట్‌బిన్ లేదా చెత్త లేకుండా చూసుకోండి.
- నీలిరంగు షేడ్స్ కళ్లకు ఓదార్పునిస్తాయి. కానీ ఆగ్నేయ దిశలో నీలం రంగు ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది.
- ముఖ్యమైన పత్రాలు, విలువైన నగదు, ఆభరణాలను ఇంటి పశ్చిమ భాగంలో ఉంచడం మంచిది.
- ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మిదేవి ఇంట్లో స్థిరంగా ఉంటుంది.
- వర్షాలు కురిసినప్పుడు, పైకప్పులు, గోడలు లేదా అడ్డుపడే పైపుల నుంచి నీటి లీకేజీలను వెంటనే పరిష్కరించాలి. ఎందుకంటే వీటి కారణంగా చాలా డబ్బు వృధా అవుతుంది.
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: అలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్తగా ఉండండి.. గుడ్డిగా నమ్మవద్దు!